బహుళైశ్చిక ప్రశ్నలు - సమాసములు - 10వతరగతి
1. 'వదాన్యోత్తముడు' సమాసం, విగ్రహవాక్యం రాయండి.
అ) వదాన్యులలో ఉత్తముడు ఆ) ఉత్తముడైన వదాన్యుడు
ఇ) వదాన్యులలో శ్రేష్ఠుడు ఈ) వదాన్యులందు ఉత్తముడు (అ)
2. 'కులమునకు ఆచార్యుడు' అనే విగ్రహం గల సమాసపదము
అ) కులోచార్యుడు ఆ) కులాచార్యుడు
ఇ) ఆచార్యకులుడు ఈ) కులోత్తముడు (ఆ)
3. 'దశ దిక్కులు కాంతి భాసురంగా మారాయి' - దీనిలోని ద్విగుసమాస పదం ఏది?
అ) కాంతి భాసురం ఆ) భాసురంగా మారాయి.
ఇ) దశదిక్కులు ఈ) దిక్కుల కాంతి (ఇ )
4. 'సత్యహీనుడు' దీని విగ్రహ వాక్యం రాయండి.
అ) సత్యము చేత హీనుడు ఆ) సత్యమందు హీనుడు
ఇ) హీన సత్యము గలవాడు ఈ) సత్యములో హీనుడు (అ)
5. 'నలినాక్షుడు' అనే దాని విగ్రహ వాక్యం ఏది?
అ) నలినముల వంటి అక్షము గలవాడు ఆ) నలినముల వంటి అక్షములు
ఇ) నలినములును, అక్షులును ఈ) నలినములైన అక్షులు (అ)
6. 'రాజ వదన' అనే సమాసము
అ) ద్వంద్వము ఆ) బహువ్రీహి
ఇ) అవ్యయీ భావము ఈ) ప్రథమా తత్పురుష (ఆ)
7. 'మానమేధనముగా కలవారు' అనే విగ్రహ వాక్యం గల సమాసపదము
అ) మానధనము ఆ) మానధనములు ఇ) మానధనులు ఈ) మానధనుడు (ఇ)
8. 'మదమరాళగమన' అనే సమాసము
అ) బహువ్రీహి ఆ) ద్వంద్వము
ఇ) తృతీయా తత్పురుష ఈ) ఉపమాన పూర్వపద కర్మధారయ (అ)
9. 'జీవధనములు, యువతీ యువకులు' అనే ఈ సమాసాలు
అ) ద్వంద్వము ఆ) బహువ్రీహి
ఇ) కర్మధారయము ఈ) షష్ఠి తత్పురుష సమాసము (అ)
10. 'భూతప్రేతము' - విగ్రహ వాక్యం రాసి, సమాసం రాస్తే
అ) భూతమును, ప్రేతమును (ద్వంద్వము) ఆ) భూతము యొక్క ప్రేతములు (షష్ఠి తత్పురుష)
ఇ) భూతము నందు ప్రేతములు (సప్తమీ తత్పురుష) ఈ) భూతములో ప్రేతములు కలవి (బహువ్రీహి ) (అ)
11.'భూత పంచకము' అనే సమాసము
అ) షష్ఠి తత్పురుష ఆ) సప్తమీ తత్పురుష
ఇ) ద్విగు ఈ) బహువ్రీహి (అ)
12. 'మానధనులు' అనే సమాసము
అ) బహువ్రీహి ఆ) ద్వంద్వము ఇ) షష్ఠి తత్పురుష ఈ) ఉపమిత సమాసము (అ)
13. 'గర్వోన్నతి' - ఏ సమాసము
అ) సప్తమీ తత్పురుష ఆ) షష్ఠి తత్పురుష
ఇ) ద్వంద్వము ఈ) బహువ్రీహి (ఆ)
No comments:
Post a Comment