Pages

Showing posts with label Vemana Padyam. Show all posts
Showing posts with label Vemana Padyam. Show all posts

వేమన పద్యరత్నాకరము - బట్టి పెట్టి నాల్గు బానల చమురుతో

 వేమన పద్యరత్నాకరము - బట్టి పెట్టి నాల్గు బానల చమురుతో 

బట్టి పెట్టి నాల్గు బానల చమురుతో 
 వండి శుద్ధిచేయ దండి యగునె?
పుట్టువందుఁగల్గు పూర్వపుణ్యంబున్న, 
విశ్వదాభిరామ వినురవేమ!
 తాత్పర్యము : పాడైన వస్తువును బట్టి పెట్టి ఎంతో చమురుతో కాచి శుద్ధిచేసి వండినను అది బాగుగా నుండదు. సహజగుణము పోదు. పూర్వపణ్య మున్నయెడల పుట్టుకలోనే ఏదైన బాగుగా నుండును. నడుమ బాగుకాదు. 

Vemana Poem - Chanda merigi

వేమన పద్యం - చందమెఱిఁగి మాటఁ జక్కఁ గాఁ జెప్పిన (మూర్ఖపద్ధతి)
చందమెఱిఁగి మాటఁజక్కఁగాఁ జెప్పిన 
నెవ్వఁడైన మాఱిఁకేల పలుకు?
చందమెఱిఁగియుండ సందర్భమెఱుఁగుము,
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: మాట తీరు తెలిసి సబబుగా మాటలాడినచో ఎవ్వడును ఎదురు చెప్పలేడు. కావున చక్కగా నేర్పుగా మాటలాడు పద్ధతిని తెలిసికొనవలెను. 

Vemana Padyam - Kutiki Nedabaasi

వేమన పద్యం - కూటికి నెడబాసి  
కూటికి నెడబాసి కూర్చిన మనుజుడు 
వెలదుల గనుగొన్న వెతల జిక్కును 
చెలగియగ్ని చూచు శలభంబు చాడ్పున 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: కడుపు నిండా తినడానికి లేనివాడు కూడా స్త్రీలను చూసి బాధల పాలగుచున్నాడు. అగ్గిని చూసి అందులో పడిన కీటకము వలె. 

Vemana Padyam - Erukamaaluvaadu

వేమన పద్యం - ఎరుకమాలువాడు 
ఎరుకమాలువాడు యేమేమి చదివిన 
చదివినంత సేపు సద్గుణియగు 
కదసి తామరందు కప్ప గూర్చుండదా?
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: ఏది చదివినా అది చక్కగా జ్ఞాపకముంచుకోవాలి. లేకపోతే చదువుచున్నంత సేపే సద్గుణి అగును. తామర మీద కప్ప కూర్చున్నంత సేపే దాని విశేషము. 

Vemana Padyam - Taamu Gannavaru

వేమన పద్యం - తాము గన్నవారు దమ్ముగన్న వారును 
తాము గన్నవారు దముగన్న వారును 
చచ్చుటెల్ల తమకు సాక్షికాదె 
బ్రతుకుటెల్ల తమకు బ్రహ్మకల్పంబులా?
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: తన కళ్ళఎదుట ఎందరో చనిపోతుంటారు. తాము కూడా అట్లే వారి యెదుట చనిపోతారు. అది సాక్ష్యం కాదా? అలాంటివారి బ్రతుకు  బ్రహ్మకల్పమా? అదేం కాదు. 

Vemana Padayam - Chippalona badda

వేమన పద్యం - చిప్పలోనబడ్డ  చినుకు ముత్యంబయ్యె 
చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె 
నీట బడ్డ చినుకు నీట గలిసె 
బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: ఆల్చిప్పలో పడ్డ స్వాతి చినుకు ముత్యంగా మారుతుంది. నీటిలో పడిన చినుకు వ్యర్థం అవుతుంది. ప్రాప్తి ఉంటే తప్పకుండా ఫలితం అదే వస్తుంది. 

Vemana Padyam - అనువుగాని చోట నధికుల మన రాదు

వేమన పద్యం - అనువుగాని చోట నధికుల మన రాదు 
అనువుగాని చోట నధికుల మన రాదు 
కొంచ యమున నదియు గొదువుగాదు 
కొండ యద్ద మందు గొంచెమై యుండదా 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: మనకు తెలియని చోట గొప్పవారమని చెప్పుకోకూడదు. నెమ్మదిగా పోయినంత మాత్రాన పోయేదేమి లేదు. ఎంత పెద్ద కొండయినా అద్దంలో చిన్నగా కనిపించనంత మాత్రాన కొండ చిన్నదైపోదు. 
 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు