భాస్కర శతక పద్యాలు - అతిగుణహీనలోభికి
అతిగుణహీనలోభికి బదార్ధము గల్గిన లేకయుండినన్
మితముగ గాని కల్మి గలమీదట నైన భుజింప డింపుగా
సత మని నమ్ము దేహమును సంపద నేరులు నిండి పారినన్
గతుకగ జూచు గుక్క తనకట్టడ మీఱక యెందు భాస్కరా
తాత్పర్యము: భాస్కరా! ఏరులలో జలము నిండి ప్రవహించుచున్నను, కుక్క కతుకుటకే తలంచును కాని, చక్కగా త్రాగదు. అట్లే మిక్కిలి లోభియగువాడు తనకెంత ఐశ్వర్యమున్నను, తాను మాత్రము తక్కువగానే భుజించును, తనకు లేనప్పుడు తక్కువగా తినుట ధర్మము. లుబ్దుడు తనకు ద్రవ్యము పుష్కలముగా గల కాలముననైనను కడుపార భుజింపడని తాత్పర్యం.
No comments:
Post a Comment