Social Icons

Pages

Featured Posts

Telugu Kiranaalu - పొడుపు కథలు

పొట్టలో వేలు... నెత్తిన రాయి. - ఉంగరం
ఒక్కతొట్టి... ఇద్దరు పిల్లలు.  - పల్లికాయ
అన్నదమ్ములు ఇద్దరు, ఒకరంటే మరొకరికి పడదు, ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. వారి మధ్యకు ఎవరైనా వొస్తే పచ్చడి పచ్చడే? - ఇసుర్రాయి
ఇక్కడ వత్తు! అక్కడ వెలుగు!!? -  స్విచ్, బల్బ్
ఇంటిలో ఉంటే ప్రమోదము, ఒంటిలో ఉంటే ప్రమాదము? - పంచదార
ఇళ్ళు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ ఉంటాయి?- మ్యాపులో
ఇల్లంతా తిరిగి మూలకు కూర్చుంటుంది? - చీపురు
అబ్బాయి గారి దొడ్లో పెద్ద పండు పడితే, పరుగెత్తలేక పది మంది చచ్చారు. - పిడుగు
అన్నదమ్ములు ముగ్గురు, తిరిగితే ముగ్గురూ తిరుగుతారు, మానితే ముగ్గురూ మానుతారు? - ఫ్యాన్
బంగారు చెంబులో వెండి గచ్చకాయ? - - పనసగింజ
కుడితి తాగదు, మేత మేయదు. కానీ, కుండకు పాలిస్తుంది? - తాటిచెట్టు
కాళ్లు లేవు కానీ నడుస్తుంది. కళ్లు లేవు కానీ ఏడుస్తుంది? -మేఘం
కాళ్లు, చేతులు ఉన్నా, నడవలేనిది? - కుర్చీ 
తోలు నలుపు, తింటే పులుపు - చింతపండు
తనను తానే మింగి మాయమవుతుంది? - మైనపు వత్తి 
ఎర్రటిపండు మీద ఈగైనా వాలదు. - నిప్పు  
కాళ్లు, చేతులు ఉన్నా, నడవలేనిది? - కుర్చీ 
తోలు నలుపు, తింటే పులుపు - చింతపండు
తనను తానే మింగి మాయమవుతుంది? - మైనపు వత్తి 
ఎర్రటిపండు మీద ఈగైనా వాలదు. - నిప్పు
ఏడెకరాల మాను, రంగు రంగుల మాను. వంగి నీళ్లు తాగుతుంది? - ఇంద్రధనస్సు
ఏ రాయి వద్దన్నా ఈ రాయి కావాలి అందరికీ. ఇంతకీ, ఏ రాయి అది? - ఉప్పురాయి 
ఇల్లు ఒకటి, వెళ్లడానికి రెండు దారులు? - ముక్క 
ఎముకలు ఉండవు. కానీ, నిచ్చెన ఎక్కుతుంది. ఏమిటది? - పేను 
అయిదుగురిలో బుడ్డాడు, పెళ్లికి మాత్రం పెద్దోడు? - చిటికెన వేలు 
నిప్పు నన్ను కాల్చలేదు. నీరు నన్ను తడపలేదు. సూర్యుడితో వస్తాను, సూర్యుడితో పోతాను? - నీడ 
తమ్ముడు కుంటుతూ మైలు నడిచేసరికి, అన్న పరిగెత్తుతూ పన్నెండు మైళ్లు నడుస్తాడు? - గడియారం ముళ్లు
జానెడు ఇంటిలో మూరెడు బెత్తం - కుండ, గరిటె
అందరినీ పైకి తీసుకెళ్తుంది... తాను మాత్రం ఉన్నచోటే ఉంటుంది. - నిచ్చెన
ఇష్టంగా తెచ్చుకుంటారు ... చంపి ఏడుస్తారు. - ఉల్లిపాయ
నాలో బోలెడు నదులున్నాయి. కానీ నీళ్లు మాత్రం లేవు ఎన్నో దారులున్నాయి కానీ ఏ వాహనము పోదు. ఎన్నో దేశాలున్నాయి కానీ భూమిని కాదు, మరి ఎవరిని? - ప్రపంచపటం
అందరూ నన్ను తినడానికి కొనుక్కుంటారు కానీ తినలేరు? - కంచం
నన్ను వేసే వాళ్లే కానీ తీసేవాళ్లు లేరు? - గోడకు సున్నం
అరిచి గోలపెట్టే రాళ్లు - కీచురాళ్లు
నీరు లేని సముద్రాన్ని భద్రంగా దాటించే ఓడ - ఒంటె 
చిత్రమైన చీరకట్టి షికారుకెళ్లిందో చిన్నది పూసిన వారింటికే గాని, కాసిన వారింటికి పోనే పోదు. - సీతాకోక చిలుక
కాటుక రంగులో ఉంటాను, కమలాన్ని పోలి  ఉంటాను. విప్పితే పొంగుతాను.  ముడిస్తే కుంగిపోతాను. నేనెవరు? గొడుగు
పండునే కానీ, నన్ను తినలేరు నా పిల్లల్ని తింటారు. నన్ను గుర్తు పట్టారా? పనస పండు 
వేర్వేరు రంగుల్లో, ఆకారాల్లో ఉండే నేనంటే పిల్లలకు ఎంతో ఇష్టం. నన్ను సులభంగా ఎత్తుకోగలరు. వదిలితే మాత్రం పారిపోతాను. నేనెవరు? బెలూన్ 
నలుపు-తెలుపు రంగుల్లో  ఉంటాను.రెక్కలున్నా ఎగరలేను, పక్షినే అయినా ఈత కొట్టగలను. నా పేరేంటి?
ఎర్రని ముక్కు, తెల్లని వొళ్ళు, పొడుగ్గా పుట్టి పొట్టిగా పెరుగుతుంది?   క్రొవ్వొత్తి 
తాళి గాని తాళి, ఏమి తాళి? ఎగతాళి
తమ్ముడు కుంటుతూ కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరుగెత్తుతూ పన్నెండు మైళ్ళు నడుస్తాడు? గడియారం ముళ్ళు    
తిరిగే దీపము, గాలి-వానకు ఆగని దీపము, చమురులేని దీపము, పిట్టల దీపము? మిణుగురు పురుగు  
జారు కాని జారు, ఏమి జారు?  బజారు  
జాబు కాని జాబు, ఏమి జాబు?  పంజాబు
తొడిమె లేని పండు! చాలా కాలం ఉండు!!?  విభూతి   
డ్రస్ కాని డ్రస్, ఏమి డ్రస్? అడ్రెస్  
టూరు కాని టూరు, ఏమి టూరు?  గుంటూరు
ముడ్డి పిసికి, మూతి నాకుతారు? మామిడి పండు
అందరినీ పైకి తీసుకుకెళ్తుంది, కాని తాను మాత్రం పైకి వెళ్ళదు? నిచ్చెన       
రంగం కాని రంగం, ఏమి రంగం? వీరంగం
రాణాలనే మించిన రణం, ఏమి రణం? మరణం
 వాలం ఉంది కాని కోతిని కాదు, నామముంటుంది కాని పూజారిని కాదు?  ఉడత      
తెలిసి కుడుతుంది, తెలియక చస్తుంది?   చీమ, దోమ  
తాళము కాని తాళము, ఏమి తాళము?  ఆది తాళము    
తోక లేని పిట్ట తొంభై  ఆమడలు పోతుంది?  పోస్ట్ కార్డు  
టిక్కు టిక్కుల బండి, టిక్కులాడి బండి, అందరూ వాడే బండి, బ్రేకులు లేని బండి? గడియారం  
మత్తు కాని మత్తు, ఏమి మత్తు? గమ్మత్తు    
చెట్టుకు కాయని కాయ కరకరలాడే కాయ? కజ్జికాయ       
పిల్లికి ముందు రెండు పిల్లులు , పిల్లికి వెనక రెండు పిల్లులు, పిల్లికి పిల్లికి మధ్య ఒక పిల్లి  మొత్తం ఎన్ని పిల్లులు . - 3 పిల్లులు 
చిటపట చినికులు చిటారు చినుకులు ఎంత కురిసిన వరదలు రావు. - కన్నీళ్లు 
ఓలంతా ముల్లు  కడుపంత చేదు. - కాకరకాయ
కిట కిట తలుపులు కితారు తలుపులు తీసిన వేసిన చప్పుడు కావు  ఏమిటవి? -  కంటి రెప్పలు
అడుగులు ఉన్న కాలు లేనిది ఏది ? - స్కేల్ 
అడవిలో పుటింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వొచింది , మహాలక్షిమీలాగుంది. - గడప
ముళ్లపొదల్లో మిఠాయి పొట్లం తీయాలంటే కావాలి చాకచక్యం. - తేనె పట్టు
చిక్కని చెరువు చిక్కని నీళ్లు తెల్లని కాడ ఎర్రని పువ్వు. - దీపం
గ్రామానికి సింహాలుగా పిలవబడతారు వారు,  కొందరు విశ్వాసానికి పాత్రలు. ఎవరువారు? - కుక్కలు
పచ్చని చేలు పరిమళాల పిట్టా ఒళ్ళు విరుచుకుంది తెచ్చుకుందాం అంటే గుచ్చుకుంది. ఏమిటది? - మొగలి పువ్వు
పగలేమో కటోర తపస్వి రాత్రి భయంకర రాక్షసి. నేనెవర్ని? - గబ్బిలం
నల్లని రూపమంటూ నాలుగు చెవులు తింటే కరకర నాలుక చురచుర మంట.  ఏమిటది? - లవంగం
చుక్కలు చుక్కల రాణిని బంగారు వెన్నెల ప్రాణిని బిత్తర చూపులు దానిని చెంగుచెంగున దూకి దాన్ని. నేనెవర్ని ? - జింక లేడి
అందరి కంటే అందగాడు రోజుకొక లాగా తయారవుతాడు ఆఖరుకు నిండుసున్నా అవుతాడు.  ఏమిటది? - చంద్రుడు
అందమైన కోట లో నాట్యం చేసే అందగత్తె.  ఏమిటది? - నాలుక
దానికి ఆకలి వెయ్యదు దాహం అవ్వదు ఎవరిని ఇంటి లోనికి రానివ్వకుండా కాపలాగా ఉంటుంది.  ఏమిటది? - తాళం
మీరు నా నుంచి ఎంత తీసుకుంటే నేను అంత పెద్ద గా తయారవుతాం.  ఏమిటది? - గొయ్యి
మేమిద్దరం సోదరులను ఒక తల్లి బిడ్డలం ప్రతిరోజు ఒకరి తర్వాత ఒకరిని మిమ్మల్ని కలుస్తాను. ఎవరువారు? - పగలు,  రాత్రి
తెల్లని మొక్క ఎర్రగా పూసి పరిమళించే మాయమైపోతుంది. ఏమిటది? - కర్పూరం
అది కారు కాని కారు ఇంధనం అవసరమే లేదు పరుగులు మహా జోరు కాని రోడ్డు తో పనిలేదు. ఏమిటది? - పుకారు
నేను ఒక పండు నాలో పోషకాలు నిండు నాపేరు జంతువు వలే  ఉండు.  ఏమిటది? - డ్రాగన్ ఫ్రూట్
పండు ముళ్ళ పండు పట్టుకుంటే గుచ్చుకుంటుంది తినమంటే తీయగనుండు. ఏమిటది? - అనస పండు పైనాపిల్
నీవు ఎంతో అవసరమని వేస్తారో అంతలోనే అవసరం లేదని తీసేసారు అలాంటిదానిని నేను నేను ఎవరిని? - కరివేపాకు 
ఆకు చిటికెడు కాయ మూరెడు.  ఏమిటది? - మునగకాయ
పొద్దున తలుపు తట్టి ఉత్సాహాన్ని ఇచ్చేవాడు జీతం తీసుకోకుండా శుభ్రంగా చేసేవాడు ఆరోగ్యంతో ఆహ్లాదాన్ని పంచేవాడు. - సూర్యుడు
సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు.  ఏమిటది? - సూది
పళ్ళు నా నోరు లేనిది.  ఏమిటది? - రంపం
చేతికి దొరకనిది ముక్కుకు  దొరుకుతుంది ఏంటది? -  వాసన
నాలుగు కర్రల మధ్య నల్ల రాయి.  ఏమిటది? - పలక
కోస్తే తెగదు కొడితే పగలదు ఏంటది? - నీడ
అరచేతిలో అద్దం ఆరు నెలల యుద్ధం - గోరింటాకు
ముక్కుకి ముత్యం కట్టుకుని తోకతో నీళ్ళు తాగుతుంది ఏంటది? - దీపం
అందరినీ పైకి తీసుకెళ్ళి తను మాత్రం పైకి వెళ్లలేదు ఏమిటది? - నిచ్చెన
సంతల నీ తిరుగుతాడు సమానంగా పంచుతాడు ఏమిటది? - త్రాసు 
వేయ కనులు ఉండు ఇంద్రుడు కాదు కాలు నాలుగు ఉండు పశువు కాదు నరుడు పటుకుంటే నడప గలదు. ఏమిటది? - మంచం
అందమైన చెరువులో ముద్దొచ్చే పీట మూతి బంగారం తోకతో నీళ్ళు తాగు. ఏమిటది? - దీపం
తోక లేని పిట్ట తొంభై కోసులు పోతుంది. ఏమిటది? - ఉత్తరం
ఏమి లేనమ్మా ఎగిరెగిరి పడుతుంది అన్ని ఉన్నమ్మ అణిగిమణిగి ఉంటుంది. ఏమిటది? - విస్తరాకు
 ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు పట్టుకుని వేలాడుతూ ఉంది కానీ పడుకోదు ఏమిటది? - తాళం
అరచేతి కి 60 తూట్లు - జల్లెడ
పొట్టి వాడికి పుట్టినంత బట్టలు - ఉల్లిపాయ
అమ్మ తమ్ముడుని కాదు కానీ మీ అందరికీ మేనమామని నేనెవర్ని - చందమామ    
రాజు గారి తోటలో రోజాపూలు చూచేవారే గాని కోసేవారు లేరు ఏమిటవి? - నక్షత్రాలు
నాకు కన్నులు చాలా ఉన్నాయి కానీ చూసేది రెండుతోనే నేనెవరు? - నెమలి 
నామము ఉంది గాని పూజారిని కాదు వాలం(తోక ) ఉంటుంది కానీ కోతిని కాను నేను ఎవర్ని? - ఉడుత
అందరినీ పైకి తీసుకెళ్తాను కానీ నేను మాత్రం వెళ్లలేను నేను ఎవరు? - నిచ్చెన
రెక్కలుంటాయిగానీ పక్షి కాదు. గిరగిరా తిరుగుతుంది కానీ గానుగ కాదు. ఏమిటది? -  ఫ్యాను 
నాలుగు కాళ్లున్నాయి కానీ జంతువుకాదు. రెండు చేతులున్నాయి కానీ మనిషికాదు. ఏమిటది? - కుర్చీ 
వేలెడంతే ఉంటుందిగానీ, మనం ఇంట్లోకి రావాలంటే అది ఉండాల్సిందే?  - తాళం చెవి
పచ్చని పెట్టెలో విచ్చుకోనుందీ, తెచ్చుకోపోతేను గుచ్చుకుంటుంది. - మొగలి పువ్వు
చెట్టుచూడు, చెట్టందం చూడు, చిత్రమైన చిగురాకును చూడు, పూసిందంటే ఒకటే పూవు చూడు, కాసిందంటే గంపెడు కాయలు చూడు. - ఆకాశం, వెన్నెల, చంద్రుడు, చుక్కలు
తెలిసేటట్లు పూస్తుంది... తెలియకుండా కాస్తుంది? - వేరుశెనగ
ఒకటి పట్టి ఎత్తితే... రెండు ఉయ్యాల లూగుతాయి? - త్రాసు
బంగారం, వెండి గనులు ఒకే గుహలో కన్పిస్తాయి. - కోడిగుడ్డు 
వేపకాయంత బంగారం, అరచేతిలో పట్టడం కష్టం. - నిప్పు 
సన్నని పిల్ల వందల చీరలు కట్టి మందమయ్యింది? - ఉల్లిపాయ 
ఆకారంలో ఉన్నప్పుడు అందగాడు. పక్షం రోజుల్లో పరార్? - చంద్రుడు 
కాళ్లు చేతులు ఉన్నా నడవలేనిది? - కుర్చీ
ఎందరు ఎక్కినా విరగని మంచం - అరుగు
అంగుళం ఆకు... అడుగున్నర కాయ - ములక్కాయ
నూరుమంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు - చీపురు 
చాపను చుట్టలేం, పైసలు లెక్కపెట్టలేం - ఆకాశం, నక్షత్రాలు 
అరచేతికి  అరవై తూట్లు - జల్లెడ
ఆకలేయదు, నీరుతాగదు, నేలని పాకదు ..ఏమిటా తీగ?. (విద్యుత్తు తీగ)
ఆ కొండకు, ఈ కొండకు ఇనప సంకెళ్లు. ( చీమల దండు)
ఆకలేయదు, నీరుతాగదు, నేలని పాకదు ..ఏమిటా తీగ?. (విద్యుత్తు తీగ)
తోకలేని పిట్ట ఊరంతా తిరిగింది. (ఉత్తరం)
తోవలో పుట్టింది, తోవలో పెరిగింది, తోవలో పోయేవారి కొంగు పట్టింది. (ముళ్ల మొక్క)
ఆ ఆటకత్తె ఎప్పుడు లోపలే నాట్యం చేస్తుంది. ( నాలుక)
ఆకాశం లో అరవై గదులు. గదికో సిపాయి, సిపాయికో తుపాకీ. ( తేనెపట్టు)
ఆకాశాన పటం, కింద తోక … ( గాలి పటం)
చిటపట చినుకులు చిటారి చినుకులు ఎప్పుడు రాలిన చప్పుడు కావు. ( కన్నీరు)
ఇంటి వెనుక ఇంగువ చెట్టు, ఎంత కోసినా తరగదు. (పొగ)
అమ్మకి తమ్ముడిని కాను, కానీ నేను మీకు మేన మామని? (చందమామ)
పోకంతా పొట్టోడు, ఇంటికి గట్టోడు. ( తాళం కప్ప)
ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు. (కల్లు కుండలు)
నామముంది కానీ పూజారి కాదు, వాలముంది కానీ కోతి కాదు. (ఉడుత)
ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి. (దీపం)
పైన చుస్తే పండు, పగుల గొడితే బొచ్చు. (పత్తికాయ)
నీళ్ళల్లో పుడుతుంది, నీళ్లలో పడితే చస్తుంది. (ఉప్పు)
శివరాత్రి కి జీడికాయ, ఉగాదికి ఊరగాయ. (మామిడి పిందె)
గాడి నిండా రత్నాలు, గదికి తాళం. (దానిమ్మ పండు)
తెల్లని పోలీసుకి నల్లని టోపీ. (అగ్గిపుల్ల)
పచ్చని చెట్టు కింద ఎర్రని చిలుక. (మిరప పండు)
కానరాని విత్తనం, ఘనమైన చెట్టు. (మర్రిచెట్టు)
ఒక స్తంభానికి నలుగురు దొంగలు. (లవంగం)
నాలుగు కర్రల మధ్య నల్లని రాయి.  (పలక)
చక్కనమ్మ చిక్కినా అందమే. (సబ్బు)
దొంతర దొంతర దుస్తులు, బంగారు వన్నె జుట్టు, కలిగిన తల్లికి ఎంతో అందమైన పిల్లలు. (మొక్కజొన్న కంకి)
కొంచమైనా కాన రాని పసుపు, వొళ్ళంతా పులుపు,పైనేమో నునుపు? (నిమ్మ పండు)
నగరాలూ, పట్టణాలు దాటేస్తుంది,ఎంతెంత దూరమైనా వెళుతుంది, కానీ ఉన్నచోటు నించి కదలదు. (రహదారి (మనసు))
అరిచి గోల పెట్టె రాళ్లు? ( కీచు రాళ్లు)
యంత్రం కానీ యంత్రం. (సాయంత్రం)
అవి తెల్లని మల్లె మొగ్గలు, పరిమళాలు వెదచల్లవు కానీ, పరి శుభ్రంగా ఉంచుతాయి. (ఇయర్ బడ్స్)
క్రమమైన పయనం, నల్లపూసల సైన్యం. (నల్ల చీమల దండు)
నాకున్నది ఒకే కన్ను, చూడలేను కానీ ముక్కు చాలు ముందుకు దూసుకు పోను!(సూది)
కాళ్ళు చేతులు ఉన్నా నడవలేనిది. (కుర్చీ)
ఎర్రని కోటలో తెల్లని భటులు. (పళ్ళు (teeth))
ఎండిన బావిలో పిల్లలు గంతులేస్తారు. (పేలాలు (popcorn))
ఎందరెక్కినా విరగని మంచం. (అరుగు)
 ఇంటికి, ఆ ఇంటికి మధ్య ఒకటే దూలం. (ముక్కు)
మనిషికి రెండే కాళ్ళు, ఏడు చేతులు. (నిచ్చెన)
అరచేతి పట్నాన అరవై రంధ్రాలు. ( జల్లెడ)
అంగుళం గదిలో, అరవై మంది నివాసం. (అగ్గిపెట్టె)
అంగుళం ఆకు, అడుగున్నర కాయ. (ములక్కాయ)
అందరాని వస్త్రంపై అన్నీ వడియాలే. (నక్షత్రాలు)
అడుగులున్నా కాళ్ళు లేనిది. ( గజం బద్ద (స్కేల్))
 కోస్తే తెగదు.  కొడితే పగలదు? (నీడ)
దూడ అక్కడే ఉంటుంది గానీ ఆవు మాత్రం అలా పోతూనే ఉంటుంది? (గుమ్మడి తీగ)
తలపుల సందున మెరుపు గిన్నె. (దీపం)
నల్లకుక్కకు నాలుగు చెవులు. ఏమిటది? (లవంగం)
తల్లి దయ్యం.... పిల్ల పగడం. ఏమిటది? (రేగు పండు)
ఇటునుంచి చూస్తే గుండు, ఆడికి పోయి చూస్తే పండు. పండుకు పన్నెండు ఒప్పులు. ఒప్పుకు ముప్పయి గింజలు. ఏమిటవి?(సంవత్సరం)
ఈనదు, పొర్లదు. బంధం వేస్తే పది బిందెల పాలి స్తుంది. ఏమిటది?(తాటిచెట్టు)
ఈకలు లేని కోడి ఇల్లు ఎక్కింది. ఏమిటది?(అనపకాయ)
ఇంటికి కాపలా కాస్తుంది, కానీ కుక్క కాదు. ఏమిటది? (తాళం)
శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ... ఏంటదీ? (మామిడి కాయ)
సంతలన్నీ తిరుగుతాడు. సమానంగా పంచుతాడు.(త్రాసు)
కుడితి తాగదు, మేత మేయదు.కానీ కుండెడు పాలు ఇస్తుంది. ఏమిటది? (తాటి చెట్టు)
 కొన్నప్పుడు నల్లగా ఉంటాను వాడితే ఎర్రగా మారుతాను. చివరికి తెల్లగా అవుతాను. నేనెవరిని? (బొగ్గు)
నీటిలో పుడుతుంది.నీటిలో పెరుగుతుంది. బయటికి వచ్చి బతుకుతుంది. మళ్లీ నీటిలో మునిగితే చస్తుంది? ఏమిటది? (ఉప్పు)
కాళ్లు నాలుగు, పక్కటెముకలు నాలుగు. పేగులు గంపెడు. ఏమిటో చెప్పండి? (నులక మంచం)
సూది వెళ్లి చుక్కల్ని తాకింది (తారాజువ్వ)
ప్రాణమున్నా ఉన్నచోట నుంచి కదలలేదు (గుడ్డు)
పట్టుకుంటే ఆరిపోతుంది.... వదిలేస్తే వెలుగుతుంది. (మిణుగురు పురుగు)
నాపై పట్నాలుంటాయి, ప్రజలుండరు.  
నదులు ఉంటాయి, ప్రవహించవు. 
సముద్రాలు ఉంటాయి, ప్రవహించవు. 
తిప్పితే గుండ్రంగా తిరుగుతాను. (భూగోళం)
తోకలేని పిట్ట, తొంభై ఆమడ తిరిగింది (ఉత్తరం)
తండ్రి గర గర, తల్లి పీచు పీచు 
బిడ్డలు రత్నమాణిక్యాలు (పనస పండు)
జీవం ఉంది, కదల్లేదు (గుడ్డు)
బంగారం అంటే మూసుకుంటుంది 
మట్టి అంటే తెరుచుకుంటుంది (నోరు)
చెక్కని స్తంభం, చెయ్యని కుండ 
పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం (కొబ్బరి చెట్టు, కొబ్బరి కాయ, కొబ్బరి నీళ్లు)
కొక్కిరిస్తే కొక్కిరింత, ముద్దుకో ముద్దు, గుద్దుకో గుద్దు (అద్దం)
చూసేది చెప్పలేదు, చెప్పేది చూడలేదు (కన్ను, నాలుక)
చిటారు కొమ్మన మిఠాయి పొట్లం (తేనెతుట్టె)
చింపిరి చింపిరి గుడ్డలు, ముత్యాల వంటి బిడ్డలు (మొక్కజొన్న కంకి)
పైడి పెట్టెలో ముత్యపు గింజ. (వరి గింజ)
సన్నని స్తంభం ..... ఎవరూ ఎక్కలేరు, దిగలేరు? (సూది)
నూరు పళ్లు ..... ఒకటే పెదవి?  (దానిమ్మ పండు)
మూడు రొట్టెలను ఆరుగురు చించకుండా పంచుకుని తింటారు. వారు ఎవరో చెప్పగలరా? (ఆరు పెదవులు)
తోలు నలుపు, తింటే పులుపు? (చింతపండు)
అందరినీ పైకి తీసుకెళ్తుంది, తాను మాత్రం పైకి వెళ్లదు? (నిచ్చెన)
సముద్రంలో పుట్టి పెరిగి, ఊళ్లో అరిచేది ఏమిటి? (శంఖం)
రెండు కొడతాయి. ఒకటి పెడుతుంది. ఏమిటవి? (ఎండా, వాన, చలి)
ఇల్లంతా వెలుగు.... బల్లకింద చీకటి? (దీపం)
తెలిసేలా పూస్తుంది.... తెలియకుండా కాస్తుంది? (వేరుశెనగ కాయ)
చిన్న పిల్లలకు చాలా చీరలు? (ఉల్లిపాయలు)
వేలాడే అడుగు పొడుగు పట్నంలో, అరవై ఆరు గదులు.
గదికో సిపాయి, సిపాయికో తుపాకి. ఏమిటది? (తేనెపట్టు)
తీగలపైన గానీ, తొర్రల పైన గానీ
వేళ్లు నాట్యం ఆడుతుంటే వీనుల విందు అవుతుంది. ఏమిటది? (వీణ, వేణువు)
కడవంతటి వళ్ళు, వంటి నిండా ముళ్లు
కడుపంతా మధురమైన గుళ్లు. ఏమిటది? (పనస పండు)
రెండిళ్లకు ఒకటే దూలం.
బ్రతకటానికి ఇదే మూలం. ఏమిటది? (ముక్కు)
అందర్నీ గమ్యం చేరుస్తుంది,
తాను మాత్రం ఉన్నచోటనే ఉంటుంది. ఏమిటది? (రోడ్డు, దారి)
నేనందర్నీ చూస్తాను,
నన్ను నేను చూడలేను. ఏమిటది? (కన్ను)
చక్కని చెరువు, చిక్కని నీళ్లు
తెల్లని కాడ, ఎర్రని పువ్వు. ఏమిటది? (దీపం)
రెండు చేతులు, రొమ్ముపైన కళ్లు
తలా నోరు లేకున్నా నిత్యం మనిషిని మింగుతూనే ఉంటుంది. ఏమిటది? (చొక్కా)
ఆకాశంలో తేలుతుంది, మేఘం కాదు.
తోకాడిస్తుంది, పిట్ట కాదు.
పట్టుతప్పితే ఎటో పారిపోతుంది. ఏమిటది? (గాలిపటం)
బ్రతికించేదొక హారం చంపేదింకొక హారం. ఏమిటది? (ఆహారం, సంహారం)
నీటిలో పుట్టింది, చిప్పలో పెరిగింది.
కోటలోకి వచ్చింది, నెత్తిపైకి ఎక్కింది. ఏమిటది? (ముత్యం)
ఉదయం తరుగుతూ పోతుంది,
సాయంత్రం పెరుగుతూ పోయి,
హఠాత్తుగా మాయమవుతుంది. ఏమిటది? (నీడ)
పువ్వుల్లో పుడుతుంది,
వెయ్యిమంది కాపలాలో అరల్లో దాగి వేలాడుతుంది. ఏమిటది? (తేనె - తేనెపట్టు)
తాతకు దూరమైనా, మామకు దగ్గరయ్యేది ఎవరు? (పెదవులు)
తెల్లటి నేలపైన నల్లటి విత్తనాలు,
చేత్తో చల్లటం, నోటితో ఏరటం. ఏమిటవి? (తెల్ల కాగితం మీద రాయటం, చదవటం)
ఉదయం నాలుగు కాళ్ళతో
మధ్యాహ్నం రెండు కాళ్లతోను,
సాయంత్రం మూడు కాళ్లతోను నడిచే ప్రాణి ఏది? (మనిషి)
చిన్నతనంలో అందరూ మెచ్చేదే,
పెద్దై కొండెక్కినాక పనికిరానిదవుతుంది. ఏమిటది? ఇంత వత్తి చెప్తున్నా ఇంకా తెలియలేదా?
(దీపం వత్తి)
నిలవ ఉన్న నీరైనా అదే,
చేతికి వేసుకునే దైనా అదే. ఏమిటది? (మురుగు)
చరచరా పాకుతుంది, పాము కాదు.
బిరబిరా ఎక్కుతుంది, దిగుతుంది పిల్లి కాదు.
కీచుకీచు మంటుంది పిట్ట కాదు. ఏమిటది? (బావి గిలక పై చేంతాడు)
సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి ఊళ్ళోకొచ్చి ఉరుముతుంది. ఏమిటది? (శంఖం)
రెక్కలున్నాయి కానీ పక్షి కాదు. వేలాడుతుంది కానీ గబ్బిలం కాదు. దాని పేరేంటి? (ఫ్యాన్)
యంత్రం కాని యంత్రం. ప్రతిరోజూ చూస్తాం. ఏమిటది? (సాయంత్రం)
రాత్రీ పగలు, ఎండా వానా లెక్కే లేదు. ఎప్పుడు దూకమంటే అప్పుడే బావిలో దూకుతుంది?ఏమిటది? (చేద)
ఎంత తీసుకున్నా అంత మొందనిది. ఎంత ఇచ్చినా అంతులేనిది? ఏమిటది? (విద్య)
చింపిరి గుడ్డల పొత్తిళ్లలో ముత్యాల వరుస బిడ్డలు. ఏమిటవి? (మొక్కజొన్న కంకి)
గణ గణ మంటూ దూసుకు వచ్చేస్తుంది
మబ్బులా కురుస్తుంది, పోరాడి తిరిగిపోతుంది. ఏమిటది? (ఫైర్ ఇంజన్)
భూమిని లాగిపట్టేది
భూమి లాగిపట్టేది.
విశ్వమంత వ్యాపించిందీ, కంటికి కనిపించనిదీ శక్తి. ఏమిటది? (గురుత్వాకర్షణ శక్తి)
ఎంతో నమ్మిన బంటు, వాసనతో వేటాడే బంటు
కనిపిస్తేనే సంతోషంతో ఊగి ఊగి పోతుంది. ఏమిటది? (కుక్క)
నల్ల నీళ్లు తాగుతుంది, ముక్కుతో దేకుతుంది.
చేతిలో ఇముడుతుంది, ముసుగు పెట్టి పడుకుంటుంది. ఏమిటది? (పెన్ను)
మట్టి మనిషి, చక్రం తిప్పే మనిషి
అందరికీ కావలసిన మనిషి. ఏమిటది? (కుమ్మరి)
తోకనిండా అందమైన కళ్లు
నాట్యం చేసేటప్పుడు తెరచి తెరచి చూస్తాయి. ఏమిటది? (నెమలి)
తెల్లని సువాసనల మొగ్గ
ఎర్రగా పూసి మాయమైపోతుంది. ఏమిటది? (కర్పూరం)
వళ్లంతా కళ్లు, లోన నల్ల రాళ్లు,
రాళ్ల చుట్టూ మాధుర్యం, విసుగైనా విడిచిపెట్టరెవరు. ఏమిటది? (సీతాఫలం)
వ్యాపారికి ముద్దు, న్యాయానికి గుర్తు
తలతీస్తే పాలిస్తానంటుంది. ఏమిటది? (తరాజు)
ఒక మహిళ, కట్టుకునే చీర,
ఆపై ఒక పక్షి, మూడూ కలిసిన ఆ కీటకమేది? (సీతాకోక చిలుక)
సగంపాలు చీకటిలో, సగంపాలు వెలుతురులో
నిరంతరంగా చుట్టి తిరిగే మట్టిముద్దల పరంపర. ఏమిటది? (గ్రహాలు)
తాను కరిగిపోతున్నా,
మంచి పంచి పెడుతూ అంతరించి పోతుంది. ఏమిటది? (కొవ్వొత్తి)
పచ్చని దుప్పటి కప్పుకొని
తియ్యని పండ్లు తింటుంది. ఏమిటది? (చిలుక)
నన్నెవరూ లెక్కచెయ్యరొకసారి
పక్కన చేర్చుకొని పదింతలంటూ సన్మానిస్తారొకసారి. ఏమిటది? (సున్న)
నీరులేని సముద్రాలు
భద్రంగా దాటించే ఓడ (ఒంటె)
ఇంటికి కావలి ఉంటుంది,
వేస్తే మూసేస్తుంది,
తీస్తే తెరిచేస్తుంది,
చెవితో సంబంధం సంగీతం బాపతు కాదు (తాళం)
రెక్కలున్నా ఎగిరేందుకు కావు
ఎంత తిరిగినా ఉన్నచోటునే ఉంటుంది (ఫ్యాన్)
కాళ్లు పట్టుకుంటుంది
వెంట వెంట వస్తుంది మనకోసం, తన కోసం కాదు(చెప్పు)
ఎక్కితొక్కితే నడిచే కాళ్లు
వడివడిగా గుండ్రంగా నడిచే కాళ్లు
నీ చేతుల్లో ఉంటుంది, నీ మాటే వింటుంది (సైకిలు)
ఇంటింటికి ప్రవహిస్తూ వస్తుంది,
పనులెన్నో చేస్తుంది,
ప్రమోదకారి, ప్రమాదకారి (విద్యుత్)
నారూ నీరూ అక్కరలేదు
ఎంత కత్తిరిస్తున్నా ఎదుగుతూనే ఉంటుంది. (జుట్టు)
వెలుతురులో నీ తోటే ఉంటుంది
చీకటిలో తప్పించుకు పోతుంది (నీడ)
పన్నెండాకుల చక్రం పదేపదే తిరుగుతుంది.
తిరిగి తిరిగి ఆ రోజున అక్కడికే తిరిగొస్తుంది. (సంవత్సరాది)
కావాలంటే పెద్ద చేసి చూపిస్తా
సూర్యుని చిన్నగ చేస్తా
మంటలు మండిస్తా         (భూతద్దం)
అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు. ఏమిటది? జవాబు : పుట్ట 
అది లేకపోతే ఎవరూ ఏమి తినరు. ఏమిటది? జవాబు : ఆకలి 
అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది. ఏమిటది? జవాబు : ఈతచెట్టు 
అడవిలో ఆంబోతు రంకె వేస్తుంది. ఏమిటది? జవాబు : గొడ్డలి 
అరచేతి కింద అరిసె ? ఏమిటది? జవాబు : పిడక 
పుట్టినా కదలంది, కొడితే మాత్రం చస్తుంది.
ఏమిటది? జవాబు : గుడ్డు 
నీళ్లలో నివసించు
కళ్లు తెరిచే నిద్రించు
మొప్పల ద్వారా శ్వాసించు
ఏమిటది? జవాబు : చేప 
మూడు కాళ్ల ముసలిదంట,
వీపు మీద నోరంట,
కవలమెత్తి చేతికిస్తే కమ్మగా దిగమింగునంట.
ఏమిటది? జవాబు : గానుగ 
నామముండు కాని పూజారి కాదు,
వాలముండు కానీ కోతి కాదు
ఏమిటది? జవాబు : ఉడుత 
జామ చెట్టు మీద జానమ్మ, ఎంత గుంజినా రాదమ్మా? జవాబు : నీడ 
యేరు మీద మిరప చెట్టు నాకగపడుతుంది, నీ కగపడదు? జవాబు : బొట్టు 
నల్లటి కుక్కకు 4 చెవులు - జవాబు : లవంగం 
పచ్చనింట్లో పదిరాళ్లు, రాళ్లపై అరవైరవలు, రవలన్నీ నలిగిపోతే గుక్కెడు నీళ్ల గుటుక్కు
జవాబు : నిమ్మకాయ 
కాటుక రంగు, కమలం హంగు, విప్పిన పొంగు, ముడిచిన కుంగు.
ఏమిటది?(జవాబు :  గొడుగు)
రెక్కలు లేవు కానీ ఎగురుతుంది.
కాళ్లు లేవు కానీ ముందుకు వెళ్తుంది.
చివరకు మాయమవుతుంది.
ఏమిటది?(జవాబు : మేఘం)
కదలకుండానే నదిని దాటగలదు?
ఏమిటది?(జవాబు : వంతెన)
ముందుకూ వెనక్కూ తప్ప పక్కలకు కదలదు.
ఏమిటది?(జవాబు : తలుపు)
గుడ్డ కింద దాగున్న దొంగకు నాలుగు కాళ్లు.
ఎవరది?(జవాబు : టేబుల్)
చెట్టంతా చేదుమయం,
రోగాలకు దివ్య ఔషదం,
పుల్ల చేయు దంతదావనం.
ఏమిటది?(జవాబు : వేపచెట్టు)
నల్ల కుక్కకు నాలుగు చెవులు?
ఏమిటది?(జవాబు : లవంగం)
పొట్టలో వేలు, నెత్తి మీద రాయి?ఏమిటది?(జవాబు : ఉంగరం)
సన్నని స్తంభం,
ఎక్కలేరు, దిగలేరు?ఏమిటది?(జవాబు : సూది)
ఆకాశంలో కెగిరినా పక్షి కాదు,
తోక కలిగిఉన్నా మేక కాదు,
తాడు ఉన్నా ఎద్దు కాదు,
ఏమిటది?(జవాబు : గాలిపటం)
వేసే వేసే జీలకర్రా,
మొలిచే మొలిచే మూలకా కూర,
పూసే పూసే బొండు మల్లే,
వేసే వేసే వింత గెలరా,
కాసే కాసే కామంచీ. ఏమిటది?(జవాబు : అరటి)
నల్లని చేనులో తెల్లటి దారి?
ఏమిటది?(జవాబు : తల్లో పాపిడి)
దూడ అక్కడనే ఉండు,
ఆవు పోతావుండు?
ఏమిటది?(జవాబు : గుమ్మడికాయ తీగ )
జవ్వాది రాయంగా,
పునుగు పూయింగా,
మందగిరి పర్వతాలలో నీరు తాగి,
మశాలకు వేసుకొని పడుకుంది. ఏమిటది?((జవాబు : దివిటి)
రెక్కలు గల మా చక్కని భామలు,
నిక్కముగా అసలెగురలేదు,
నీరంటే అడ్డమే లేదు.  ఏమిటది?(జవాబు : పడవ)
అగ్గి అగ్గీ ఛాయ,
అమ్మ కుంకుమ ఛాయ,
బొగ్గు బొగ్గు ఛాయ,
పోలి ఛాయ కంది పప్పు ఛాయ,
కాలనేమి ఛాయ,
కడసారి తాతయ్య కణతి ఛాయ. ఏమిటది?(జవాబు : గురిగింజ)
అమ్మ కడుపున పడ్డాను,
అంతా సుఖాన ఉన్నాను,
నీచే దెబ్బలు తిన్నాను,
నిలువునా ఎండి పోయాను,
నిప్పుల గుండు తొక్కాను,
గుప్పెడు బూడిద అయినాను. ఏమిటది?(జవాబు : పిడక)
అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది,
మాఇంటికొచ్చింది,
మహాలక్ష్మి లాగుంది. ఏమిటది? (జవాబు : గడప)
అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది,
మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. ఏమిటది? (జవాబు : చల్ల కవ్వం)
అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు,
కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు,
అన్ని పువ్వుల్లో రెండే కాయలు. ఏమిటవి?(జవాబు : ఆకాశం, చుక్కలు, సూర్యుడు
బుర్రు బుర్రు మనచును ....
రోడ్డు పైన నడచును.......  ఏమిటది? (జవాబు : స్కూటర్)
కుర్రు కుర్రు మనచును .........
చెట్టుపైకి ఎగురును .......... ఏమిటది? ( జవాబు : కోతి)
తుర్రు తుర్రు మనచును ......
అంబరానికెగురును....... ఏమిటది? (జవాబు : పక్షి)
అంబ అంబా అని అరుచును
తల్లి వెంట తిరుగును .....ఏమిటది ?(జవాబు : తువ్వాయి (ఆవుదూడ))
మీట నొక్కినంతనే .........
టక్కుమని వెలుగును ...... ఏమిటది? (జవాబు : బల్బు)
చుట్ల చుట్ల గోడ మీద నూరు నిమ్మపండ్లు పుట్టె,
రాజులంత తలవంచిరి. ఏమిటది? (జవాబు : మొక్కజొన్నకంకి)
 ఒక చెట్టు,
 చెట్టుకు నాలుగు కొమ్మలు,
కొమ్మకు రెండు కాయలు. ఏమిటవి? ( జవాబు : సూర్యుడు, చంద్రుడు)
కావాలంటే పెద్ద చేసి చూపిస్తా
సూర్యున్ని చిన్నగా చేస్తా
మంటలు మండిస్తా. ఏమిటది? (జవాబు : భూతద్దం)
పన్నెండాకుల చక్రం పదే పదే తిరుగుతుంది.
తిరిగి తిరిగి ఆ రోజున అక్కడికే తిరుగొస్తుంది. ఏమిటది?(జవాబు : సంవత్సరాది)
వెలుతురులో నీతోటే ఉంటుంది.
చీకటిలో తప్పించుకు పోతుంది. ఏమిటది? (జవాబు : నీడ)
నారూ  నీరూ అక్కరలేదు
ఎంత కత్తిరిస్తున్నా ఎదుగుతునే ఉంటుంది.  (జవాబు : జుట్టు)
ఇంటింటికి ప్రవహిస్తూ వస్తుంది,
పనులెన్నో చేస్తుంది,
ప్రమోదకారి, ప్రమాదకారి. ఎవరది? (జవాబు : విద్యుత్)


చదువున్నా లేకున్నా తల్లిలా వెంటనంటి ఉంటుంది.
కనపడని మనస్సును వినపడేట్లు చేస్తుంది. (మాతృభాష తెలుగు)
గులాబిలో ఉన్నా, మాలతిలోనూ ఉన్నా
జాజి పువ్వులోలేను, ఎవర్ని నేను?("ల" అక్షరం)
పుట్టెడు సంగతుల్ని పోగుచేసి తెస్తుంది.
ఒక్కనాటి వైభోగం మర్నాటికి మాస్తుంది. (వార్తాపత్రిక)
ఏడాదికి ఒక్కసారి నీకోసం వస్తాను.
ఆప్యాయముగా పలకరించిపోతాను.(పుట్టినరోజు పండుగ)
అల్పుణ్ని పైకెత్తుతుంది
అధికుడైతే అధోగతే!(తరాజు)
ఆకుపచ్చ కాయ వగరు, పండితే తీపి ?(అరటి)
ఆ కొండకీ, ఈ కొండకీ ఇనుప సంకెళ్ళు? (విస్తరాకు)
ఆకు చిటికెడు కాయ మూరెడు ?(మునగ కాయ )
జామ చెట్టు కింద జానమ్మ ఎంత గుంజినా రాదమ్మ ?(నీడ)
ఆకాశాన అరవై గదులు గదికొక్క సిపాయి, సిపాయి కొక్క తుపాకీ ?(తేనెపట్టు)
అనగనగా ఒక గచ్చు మేడ, గచ్చు మేడ పై చెక్క మేడ, చెక్క మేడ ముందు కంచు మేడ, కంచు మేడలో ముత్యాలమేడ, ముత్యాలమేడలో అయిదుగురు నాట్యం?(నేల, పీట, పళ్లెం, అన్నం, వేళ్లు)
అది లేనిదే నేను తినను.ఏమిటది ?(ఆకలి)
చూస్తే చూపులు,నవ్వితే నవ్వులు,గుద్దితే గుద్దులు ?(అద్దం)
అమారా దేశం నుండి కొమారా పక్షి వచ్చింది.ముక్కుకి ముత్యం కట్టుకొని తోకతో నీళ్ళు తాగుతుంది.(ప్రమిద)
ఆకు వక్క లేని నోరు ఎర్రన, నీరు నారు లేని చేను పచ్చన(రామచిలుక)
మేసేది కాసింత మేత, కూసేది కొండంత కూత (తుపాకి)
కోస్తే తెగదు,కొడితే పగలదు (నీడ
చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తియ్యగ నుండు (కొబ్బరి కాయ)
కోడి కాని కోడి (( పకోడీ ))
కారం కాని కారం ((ఉపకారం ))
దానం కాని దానం( (నిదానం ))
అడవిలో పుట్టింది. అడవిలో పెరిగింది, మాఇంటి కొచ్చింది, తైతక్క లాడింది.(చల్లకవ్వం)
వేలెడంత ఉండదు. కానీ మనం బయటకు వెళ్ళాలన్నా. ఇంట్లోకి రావాలన్నా అది ఉండాల్సిందే. ఎవరది?(తాళం చెవి)
రెక్కలున్న ఎగరలేదు. ఎంత తిరిగినా ఉన్న చోటు నుంచి కదలలేదు. ఏమిటది?(ఫ్యాన్ )
చూస్తే చూసింది గానీ కళ్లులేవు
నవ్వితే నవ్విందిగాని నోరు లేదు
తంతే తన్నబోయింది కానీ కాళ్లు లేవు (అద్దం)
చూసింది ఇద్దరు
కోసింది ఐదుగురు
తినింది ముప్పైఇద్దరు (పళ్లు)

Telugu kiranaalu - సుభాషితాలు

బాధ్యతల నుంచి తప్పుకోవటం వల్ల ఆధ్యాత్మిక చింతన పొందలేం.
నేనే నిశ్శబ్దానికి ప్రతీకను అని మనస్సును అభినందించగలగడమే ధ్యానం
ఎవరికి ఇవ్వవలసింది వారికి ఇవ్వడమే ధర్మం
ధ్యానమంటే ఓ పనిమీద లగ్నం గావించటం
మనకు జన్మనిచ్చిన భగవంతుని చేతుల్లోనే మన కర్మఫలం ఉంటుంది.
మనకు జన్మనిచ్చిన భగవంతుని చేతుల్లోనే మన కర్మఫలం ఉంటుంది.
జ్ఞానంయొక్క స్వయంసాధనే ధ్యానం
ప్రేమ ఉన్నచోట జీవితముంటుంది. పగ ఉన్నచోట నాశనం ఉంటుంది.
ధ్యానాన్ని ఒక పనిగా చేయకు; ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యి
నీకు ఇతరులు ఏది చేయాలని కోరుకుంటావో, అదే నువ్వు ఇతరులకు చేయడం ధర్మం
ధైర్యమే వ్యక్తి స్వభావానికి చిహ్నం
ఉత్తమధర్మాన్ని అంత్యజుని నుండైనా ప్రయత్నించి గ్రహించాలి
ధార్మికులకు ఆత్మరక్షణకన్నా ధర్మరక్షణే ముఖ్యం
తనకు తానేది కోరునో ఇతరులకు కూడా అదే కోరుకోవాలి
తన విధిని తాను నిర్వహిస్తూ ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకపోవడమే ధర్మం
ధర్మాన్ని అనుసరించకుండుట దాన్ని ద్వేషించుట మానవుని పతనానికి కారణాలు
జ్ఞానంయొక్క స్వయంసాధనే ధ్యానం
సత్యమున్నచోటే ధర్మముంటుంది
చెడు అలవాట్లు క్రమంగా తగ్గించుకుంటే.. కొంతకాలానికి ఎంత చెడ్డవాడైనా సరే, మంచివాడిగా మారిపోతాడు.
సత్యమార్గంలో నడిచేవాడే నిజమైన సంపన్నుడు!
కష్టాలను చూసి పారిపోయేవాడు ..... జీవితంలో ఎప్పటికీ ఆనందంగా ఉండలేడు!
మండిన కొవ్వొత్తిలాగే ...... గడిచిన కాలం కూడా తిరిగిరాదు!
ఆత్మవిశ్వాసమే..... మనిషికి అసలైన ఆభరణం!
బలహీనుడిని బలవంతుడు కొడితే ..... బలవంతుడిని భగవంతుడు కొడతాడు!
ఉపాధ్యాయుడే విద్యార్థికి విలువైన పాఠ్య పుస్తకం!
మనిషి తన కలలను పండించుకోవాలంటే ...... ముందు కళ్లు తెరవాలి!
చిన్న విజయాన్ని చూసి మురిసిపోవద్దు. అది తొలి అడుగు మాత్రమే ..... గమ్యం కాదు!
వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి ... తన సర్వస్వాన్నీ కోల్పోయినట్లే!
ప్రశ్నించనిదే సమాధానం దొరకదు ..... ప్రయత్నించనిదే విజయమూ దక్కదు!
కఠోర పరిశ్రమ అనంతరం వరించే విజయం ...... ఎంతో మధురంగా ఉంటుంది.
లక్ష్యం గొప్పదైనప్పుడు త్యాగం గొప్పదవుతుంది.
సలహా అనేది ఎవరికి అత్యవసరమో .... వారికే రుచించదు.
అదుపులేని ఆలోచనలు..... శత్రువు కన్నా ప్రమాదకరం!
తన ఆలోచననే మార్చుకోలేని మనిషి,  వాస్తవంలో ఏమీ మార్చలేడు, ఫలితంగా ఎప్పటికీ పురోగతి సాధించలేడు 
గొప్ప గొప్ప అవకాశాలేవీ ఏటేటా రావు 
మనుషుల్ని గాయపర్చడం ఎంత తప్పో .... మనసుల్ని గాయపర్చడమూ అంతే తప్పు!
మీరు కష్టపడనంత వరకు .... మీ కలలు సాధ్యం కావు! 
అందం అనేది ముఖంలో ఉండదు. సహాయం చేసే మనసులో ఉంటుంది!
అమాయకత్వం కూడా ఒక రకం  వెఱ్ఱితనమే!
కొమ్మలు నరికినా చెట్టు మళ్ళీ చిగురిస్తుంది. కష్టాలకు కుంగిపోకుండా ముందుకు సాగాలని స్పూర్తినిస్తుంది.
మంచి దారే అయినా మళ్ళీ  మళ్ళీ నడుస్తూ ఉంటేనే మంచిగా ఉంటుంది. లేకుంటే ముళ్ళకంప మొలుస్తుంది.
గెలుపు గురించి అతిగా ఆలోచించవద్దు... వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు!
 చావుబతుకులు ఎక్కడో లేవు.ధైర్యంలోనే బతుకు ఉంది. భయంలోనే చావు ఉంది.
ఓడిపోయినప్పుడు ఎలా ఆలోచిస్తామనేదాన్ని బట్టే ఎంత త్వరగా గెలుస్తామనేది ఆధారపడి ఉంటుంది.
జ్ఞానం వంశపారంపర్య సంపద కాదు. ఎవరికివారు కష్టపడి ఆర్జించుకోవలసిందే.
చేతనైతే సింహాన్ని కూడా మచ్చిక చేసుకోవచ్చు. చేతగాకపోతే తేనెటీగ కూడా తిప్పలు పెడుతుంది.
 కొత్త లక్ష్యాన్నిగానీ కొత్త కలనుగానీ ఆహ్వానించడానికి వయసుమీరడమంటూ ఉండదు.
ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం... ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి.
కోరుకున్నదాన్ని పొందగలగడం అదృష్టం, పొందగలిగినదాన్ని కోరుకోవడం ఆనందం.
పైవారితో గౌరవంగా సాటివారితో స్నేహంగా మెలగడం కాదు, తనకన్నా తక్కువవారితో మెలిగే తీరే వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.
కలలు ఆకాశంలోని నక్షత్రాల్లాంటివి.వాటిని అందుకోవడం అసాధ్యమే కావచ్చు, కానీ వాటిని అనుసరించడం ద్వారా లక్ష్యానికి చేరువ కావచ్చు.
నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేవారికి నిరాశ అనేదే కలగదు.
నువ్వు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నువ్వేంటో తెలుస్తుంది. ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది.
వర్తమాన క్షణాల్లో దొరకని శాంతి ఎక్కడా దొరకదు.
సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చెయ్యరు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే!
ఓటమి గురించి భయపడటం మొదలు పెడితే... విజయానికి దూరమైనట్లే!
గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు .... ఆనందంగా జీవించడం!
మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా... అది గెలుపే అవుతుంది!
తల మోసే భారాన్ని ఇతరులతో పంచుకుంటే తగ్గుతుంది. కానీ, మెదడు మోసే అజ్ఞాన భారాన్ని ఎవరికీ వారే తగ్గించుకోవాలి.
'సాధ్యం కాదు' అనే భావనను మనసులోంచి తొలగించుకోవడమే విజయపథంలో నువ్వు వేసే తొలి అడుగు!
పని చేసిన ప్రతిసారీ సత్ఫలితాలు రాకపోవచ్చు. కానీ, అసలు ప్రయత్నమే చేయకపోతే ఏ ఫలితమూ రాదు!
కింద పడ్డానని ఆగిపోకు ..... తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే! విధి నిర్వహణను మించిన దేశ సేవ లేదు.
సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చెయ్యరు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా ఆంతే! 
అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశావాదం ..... అతి చెడ్డ గుణాలు. వీటిని దగ్గరికి రానిస్తే .... జీవితంలో పైకి రావడం, సుఖపడటం జరుగదు.
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసేవాడు ఉన్నతుడైతే ...... దేశం కోసం త్యాగం చేసేవాడు మహాత్ముడవుతాడు!
పవిత్రమైన ప్రేమలో భయం ఉండదు. స్వార్థం మచ్చుకైనా కనిపించదు. 'ప్రేమించబడాలి' అనే ధ్యాస లేకుండా ప్రేమించడమే పరమోన్నత ప్రేమాదర్శం.
నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే రెండు చేతులకన్నా...... నువ్వు బాధలో ఉన్నప్పుడు కన్నీరు తుడిచే ఒక వేలు మిన్న!
నాయకత్వమంటే అధికారం చెలాయించడం కాదు, ప్రభావితం చెయ్యడం.
ఒక్కోసారి, మౌనంగా ఉండిపోవడం అన్నిటికన్నా ఘాటైన విమర్శ అవుతుంది.
ఒక మంచి పని చేసి ఊరుకో. దాని బాగోగులు చర్చించవలసింది ఇతరులు నువ్వు కాదు.
ప్రతి వెలుగునూ వెన్నంటి నీడ ఉంటుంది. ప్రతి నీడకూ వెలుగంటూ ఒకటి ఉంటుంది.
పైచేయి సాధించడమే గొప్పతనం కాదు, ఒక్కోసారి ఈగ కూడా సింహాన్ని చికాకు పెట్టగలుగుతుంది.
ఒక్కో సారి ఓటమి కూడా మేలే చేస్తుంది. నీ నిజమైన స్థాయి ఏమిటో నీకు తెలిసేలా చేస్తుంది.
చిన్న పనులను నిర్లక్ష్యంతో చేసేవారు గొప్ప విజయాలు సాధించలేరు.
నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా, దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ దగ్గరి నుంచే మొదలవుతుంది.
ఏ ఒక్కరూ ప్రతి ఒక్కరికీ సహాయం చెయ్యలేరు కానీ ప్రతి ఒక్కరూ మరొకరికి సహాయం చెయ్యగలరు.
చరిత్ర, స్వదేశాభిమానాన్ని నేర్పే చక్కనైన సాధనం.
గెలుపు ఓటములను నిర్ణయించడంలో ప్రధానపాత్ర సామర్థ్యానిది కాదు, స్వభావానిది.
మంచిమాట పర్యవేక్షణతో నిమిత్తం లేకుండా పనులు సజావుగా పూర్తికావడం ఉత్తమ నాయకత్వానికి నిదర్శనం.
రహస్యం... నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీ యజమాని.
ఏ పని చేయకుండా బద్దకించే వాడి కంటే ఏదో ఒక పని చేసే వాడే ఉత్తముడు.
ఏకాగ్రతతో చేసే ఏ పని అయినా తపస్సే. ముందో వెనకో దానికి ఫలితం తప్పదు.
నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి.
నాలో ఏ లోపమూ లేదు అనుకోవడాన్ని మించిన లోపం మరొకటిలేదు.
విద్య, వివేకం బావిలోని నీళ్ళవంటివి. వాడిన కొద్దీ ఊరుతూ ఉంటాయి.
అంటించే శక్తి అగ్గిపుల్లకున్నా, దాన్ని తీసి వెలిగించడానికి ఒక చేయి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడుంటాడు. కానీ దానికి రూపం ఇవ్వడానికి ఓ శిల్పి కావాలి.
ఆదియందు అక్షరమున్నది. అక్షరము దైవమై ఉన్నది. నట్టనడుమనూ అక్షరమున్నది. ఆ అక్షరము మనిషియై ఉన్నది. అంతము నందూ అక్షరమే ఉంటుంది. అక్షరం మనిషిలోని దైవమై ఉంటుంది.
'సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవదు.దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు, ఎడతెగని ప్రయత్నం కావాలి.
ఏ కారణం లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం పొందబోతున్నావన్న మాటే. అకారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది.
అందమైనది మంచిగా ఉంటుందనుకోలేం. కానీ మంచిగా ఉన్న ప్రతి విషయం అందమైనదే.
ఉదాహరణలు ఇవ్వడం చాలా సులువు. ఉదాహరణగా నిలవడం చాలా కష్టం. 
అవివేకమంటే- ఈసారి ఫలితం మరోలా ఉంటుందనే ఆశతో, చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తుండడం.
మనలోని గొప్పతనం మనకు వచ్చిన కష్టాన్ని ఎదుర్కోవడంలోనే దాగి ఉంది. 
మానవులకు 'విద్యయే' సౌందర్యము 
సూర్యుని ఉపాసించుట వలన 'ఆరోగ్యము' బాగుంటుంది 
'జ్ఞానము' పెన్నిధి వంటిది 
'సత్యము' పలుకుటయే కంఠానికి ఆభరణము 
సాధుపురుషుల 'ప్రవర్తనే' ఆచారమునకు ముఖ్యము 
శరీరమే ధర్మసాధనములలో ప్రధానమైనది 
సత్యము - తపస్సు - ఇంద్రియనిగ్రహము - భూతదయలు అంతఃశౌచములు 
సత్పురుషులకు 'ఆచారమే' లక్షణము 
విద్య వలన 'సంస్కారము' కలుగవలెను 
విద్య వలన 'వినయము' కలుగవలెను
విద్యను కోరువాడు 'సుఖము'ను త్యజించవలెను 
'ధర్మము' వలన 'ఆయుష్షు' వృద్ధి చెందుతుంది
ఆచారము నుండి  'ధర్మము' పుట్టినది
శాస్త్రములన్నింటి కంటే 'ఆచారము' శ్రేష్టమైనది
విద్య'కల్పవృక్షం' వంటిది 
ఆచారమే 'ధర్మము' నకు లక్షణము 
దైవం ప్రతి మనిషిలో అమర్చే గొప్ప సంకేత దీపం అంతఃకరణ.
నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.
తప్పు చేశానని చింతించి తిరిగి అదే తప్పు చేస్తూ ఉంటే, ఆ పశ్చాత్తాపానికి విలువేముంది!
భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము. వివేకంతో చేసే పని సత్ఫలితాన్నిస్తుంది. 
బలమైన గాటకు బరువుగా కట్టేస్తే ఎన్ని తుపానులు వచ్చినా - పడవ తీరంలో భద్రంగానే ఉంటుంది. కానీ, దాన్ని నిర్మించింది తీరంలో కట్టి పెట్టడానికి కాదన్న విషయాన్ని గ్రహించాలి. అదే - జ్ఞానం. 
మంచి అలవాట్లు మానడం చాలా సులువు చెడు అలవాట్లు మానడమే మహాకష్టం. 
ప్రయత్నం చేసి ఓడిపో .... కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. 
బ్బు కాదు.... డబ్బు మీద ప్రేమ, మోహం,దురాశ అనర్థాలకు హేతువులు. 
సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం, సర్వేంద్రియాణాం 
నయనం ప్రధానం! 
షణ్ణం రసానాం లవణం ప్రధానం, 
భావవే నదీనాముదకం ప్రధానం 
ఈ శ్లోకంలో "సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అనేది జాతీయంగా ప్రాచుర్యంలో ఉంది. దీని భావమేమంటే దేహానికి శిరస్సు ప్రధానం. అవయవాలన్నింటిలోనూ కళ్లు ప్రధానమైనవి. ఆరు రుచుల్లోనూ ఉప్పు ప్రధానమైనది. అలాగే నదులన్నింటికీ నీరు ప్రధానం. 
స్వగృహే పూజ్యతే మూర్ఖస్స్వగ్రామే పూజ్యతే ప్రభుః !
స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే!
మూర్ఖుడికి తన ఇంట్లో మాత్రమే గౌరవం ఉంటుంది. గ్రామాధికారికి తన గ్రామంలో మాత్రమే గౌరవం దక్కుతుంది. రాజుకు తన స్వదేశంలో మాత్రమే  గౌరవం ఉంటుంది. విద్వాంసుడికి మాత్రం తన ప్రాంతంలోనే కాకుండా, ఎక్కడకు వెళ్లినా గౌరవం దక్కుతుంది. 
భుజకీర్తులూ, చంద్రహారాలూ, స్నానమూ, పైపూతలూ, పూలూ అందంగా అలంకరించుకున్న శిరోజాలు - ఇలాంటివి వేవీ మానవుడికి శోభ కలిగించవు. శాస్త్ర సంస్కారం కల 'వాక్కు' ఒక్కటే అతడికి శోభ చేకూరుస్తుంది. పైన చెప్పిన సువర్ణాభరణాదులు అన్నీ నశించిపోయేవే. వాక్కు అనే భూషణ మొక్కటే శాశ్వతంగా నిలిచే భూషణం. 
గడిచిపోయిన దాన్ని గురించి ఊరికే ఆలోచించకూడదు. జరగబోవుదాన్ని గురించి ఆశాసౌధములు కడుతూ కూర్చోకూడదు. విచక్షణ జ్ఞానం గలవారు వర్తమానంలో నివసిస్తూ అప్పుడు చేయవలసిన పనులనే ఆచరిస్తారు. 
పదలయందు ధైర్యం, సంపదలున్నప్పుడు ఓర్పు, సభలలో వాక్చాతుర్యం, యుద్ధంలో పరాక్రమం, కీర్తి సంపాదించుటలో ఆసక్తి, విద్యలయందు ఆసక్తి - ఈ గుణాలు మహాత్ములకు ప్రకృతి సహజములు 
అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశావాదం - ఈ ఐదూ అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు. 
కార్లో కూర్చున్నంత మాత్రాన గొప్పవారు కాలేరెవరూ. కారు మీద కాకి కూడా కూర్చోవచ్చు. 
కోపం యమధర్మరాజు లాంటిది. తృష్ణ వైతరణి లాంటిది. విద్య కామధేనువు లాంటిది. ఇక, సంతృప్తి దేవరాజైన ఇంద్రుడు నందనవనం లాంటిది. 
అంతులేని బంధనాల్లో మనిషిని ఇరికించి వేసి, ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టే ఆశల పాశాలని తునాతునకలు చేయగలిగేది వైరాగ్యం అనే పదునైన కత్తి ఒక్కటే. 
మన పూర్వీకులు ఎంతో మంది అనుసరించి, పునీతం చేసిన బాట పైన మనం కూడా ప్రయాణం చేయాలి. ఎందుకంటే ఆ మంచిబాటపై పయనించిన వారికెన్నడూ చలనం ఉండదు. 
మనసు నిండా నిజాయితీ ఉండాలే గాని, అటువంటి మనిషి తక్కిన ఎంతో మంది కన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు. 
మనిషికి మంచి మనసుండాలే గాని, నానా విధాల సంపదలూ వాటంతట అవే కురుస్తుంటాయి. 
ప్రేమగుణం బాగా పెరిగితే, లభించే సంపద - పవిత్రత. 
వివేకానికి మారుపేరుగా నిలిచిపోయే హంసపక్షి స్మశానంలో ఉండదు. అలాగే, మంచివారు చెడ్డవారితో కలసి మెలసి ఉండలేరు. 
హృదయం నిండా పరుల పట్ల సానుభూతి పొంగి పొరలే మనిషికే, ఇతరులని విమర్శించే అధికారం ఉంటుంది. 
బంగారంలోని ప్రతి అణువు ఎంతో విలువైనది. గడిచే కాలంలోని ఒక్కొక్క ఘడియ సైతం అంతే!
మన వాకిట నిలిచిన మంచి వారినీ, మహా పురుషులనీ దర్శించుకుంటే చాలు, పుణ్యక్షేత్రాల్లో చేసిన కోట్లాది తీర్థస్నానాలకి మించిన ఫలం లభిస్తుంది. 
భగవంతుడి చల్లని చూపు లభించకపోతే, మంచి వారితో మైత్రిబంధం అసలే దొరకదు. 
సత్యమార్గం ఎంతో సులభం ...... సుఖ ప్రయాణానికి ఎంతో యోగ్యం. 
న్నీ తెలిసి ఏదీ చెయ్యలేనివాడు ఏదీ తెలియనివాడితోనే సమానం. 
అపకీర్తి కలిగితే ........ ఇంక మరణ మెందుకు?
మంచి చదువుంటే ........ ధనమెందుకు?
తనలో గొప్పతనముంటే ........ మళ్ళీ అలంకారాలెందుకు?
మంచితనముంటే ........ వేరే పరివారమెందుకు?
నిర్మలమైన మనస్సుంటే ........ తీర్థసేవ లెందుకు?
సత్యముంటే ........ తపస్సు చేయవలసిన అవసరం  లేదు 
చాడీకోరతనం ఉంటే ........  వేరే పాపాలతో పని లేదు 
పిసినారితన ముంటే ........ మరొక దుర్గుణం అక్కరలేదు 
మౌనాన్ని సాధన చేస్తూ, ఇతరుల మాటల్ని వినే గుణాన్ని పెంపొందించుకోవాలి
కాలానికి అతీతమైనది అమృతత్త్వం 
మనస్సుని అభ్యాసంతో వశపరచుకోవచ్చు 
మనస్సు నిరంతరం అతి చంచలస్వభావం గలది 
'క్షమాగుణం' ధీరుల లక్షణం 
లభించిన దానితో సంతృప్తి పడాలి 
చేసే పనిమీద ప్రేమ ఉంటే అంతా అందంగా ఉంటుంది 
ఎవరైతే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూస్తారో అతడే నిజమైన యోగి 
జ్ఞానతృష్ణ వైపు మనసుని మరల్చాలి 
నీతిగలవారికి భయం ఉండదు 
మనం 'మాయ' ఆధీనంలో ఉంటే, మాయ 'భగవంతుని' ఆధీనంలో ఉంటుంది 
తపస్సు ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది 
దైవాంశలమే అయినా మనం 'మాయ' ఆధీనంలో ఉన్నాము 
మానవులందరిలోనూ 'యోగబలం' ఉంటుంది
బంధవిముక్తి మార్గం - మమకారాలు లేని కర్మల్ని ఆచరించటమే!
కర్మవల్ల బంధం కల్గుతుంది 
తపస్సంటే - మనస్సును, ఇంద్రియాలను ఏకాగ్రపరచి, వశంలో ఉంచడమే!
నిష్కామకర్మ - ధ్యానం ల కలయికే ఆధ్యాత్మికత 
మానవ శరీరం సుఖసౌఖ్యాలనుభావించడానికి ఉద్దేశింపబడలేదు 
ఆధ్యాత్మికోన్నతికి, సౌశీల్యబలము అత్యంతావశ్యకము 
విశాల హృదయం, దృఢవిశ్వాసం ఉన్నప్పుడే ఉన్నతమైన వ్యక్తిత్వం సాధ్యపడుతుంది 
బలహీనతలు బలం వల్లే సమసిపోతాయి 
ఎదుటివారిని ఒక చిన్న అభినందన ఉత్తేజితుల్ని చేస్తుంది 
సమస్యల నుంచి పారిపోవడం వాటికి పరిష్కారం కాదు 
మానవునికి సౌశీల్యమే బలం 
బలహీనత, సౌశీల్యం కలసి మెలసి ఉండవు 
మనిషి మనస్సును స్వాధీనపరచుకుంటే ఆనందాన్ని అనుభవించగలడు 
'ఆనందం' మనసుకు సంబంధించినది 
బాహ్యోపకరణాలు మనిషికి ఆనందాన్ని ఇవ్వలేవు 
మానవుడు స్వతహాగా దివ్యస్వరూపుడు 
మనిషికి నిరంతరం అపనమ్మక ధోరణి మంచిది కాదు 
మానవునిలో 'ఆధ్యాత్మిక' స్పృహ ఉండాలి
'జ్ఞానం - తపస్సు' సమాంతరంగా సాగిపోవాలి. 
జ్ఞానాన్ని సంపాదించాలంటే 'తపస్సు' చేయాలి. 
మానవుడే 'జ్ఞానార్జన' కు అర్హుడు. 
నీచులు విఘ్నాలు వస్తాయన్న భయంతో పనికి పూనుకోరు. మధ్యములు పని ప్రారంభించి ....... విఘ్నాలు ఎదురైతే వదిలేస్తారు. ధీరులు ఎన్ని ఆటంకాలు కలిగినా ......... పూనుకొన్నపని నెరవేరేవరకూ వదలనే వదలరు. 
నీచులు కలహం కోరుకుంటారు. సజ్జనులు సంధిని కోరుకుంటారు. 
ఉత్సాహం కంటే గొప్పబలం లేదు 
తాను చేసిన పుణ్యాన్ని బట్టి మానవునికి కీర్తి లభిస్తుంది 
పుణ్యవంతుడైన పురుషునకు ఎక్కడా అసౌకర్యం ఉండదు 
ఇతరులను బెదిరించి సంపాదించిన సంపద త్వరలో నశిస్తుంది 
సరియైన మార్గంలో ప్రారంభించిన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి 
జ్ఞానం కన్నా సుఖాన్ని కలిగించేది వేరేది లేదు 
నోరు ఉన్నది కదా అని వృథాగా మాట్లాడకూడదు 
కష్టపడటం వల్ల వచ్చిన సుఖమే ఆనందాన్ని కలిగిస్తుంది 
ఎవరికీ ఏ పనిలో నేర్పు ఉంటుందో వారిని  ఆ పనిలో నియమించాలి 
గుణాలతో వైభవాన్ని పొందవచ్చు కాని వైభవంతో గుణాలను పొందలేము. 
బుద్ధిమంతులు కాలాన్ని బట్టి వ్యవహరిస్తారు 
శీలంతో సమానమైన ఆభరణం లేదు 
బుద్ధిమంతునికి అహంకారం ఉండదు 
శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే స్మరించాలి 
మంచిపనులు చేసేవాడు కష్టాల్లో ఎప్పుడూ ఇరుక్కోడు 
ఎవడైతే ధర్మాన్ని కోరుతాడో అతడే ఆరోగ్యవంతుడు 
ఓర్పువల్ల సిద్ధించని కార్యమంటూ ఉండదు
క్షణక్షణానికి ఆలోచనలు మారిపోయేవాడు ఏమీ సాధించలేడు 
పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు అధికంగా గౌరవార్హుడు. 
జ్ఞానం అనేది పెన్నిధి వంటిది 
విద్య నేర్చినకొద్దీ వృద్ధి పొందుతుంది
సంపదలన్నిటిలోను విద్యాసంపద గొప్పది 
ఇంటికి అతిథిగా వచ్చినచో శత్రువుకైననూ ఆతిథ్యమివ్వాలి 
తప్పులు జరగవచ్చుననే భయంతో ఏపని అసలే ఆరంభించకుండ ఉండడం కాపురుష లక్షణం. 
ధర్మార్గంలోనే ధనం సంపాదించాలి. 
ఉత్తమోత్తములకు అడుగడుగున మిత్రులు ఏర్పడుతూనే ఉంటారు. 
నేర్పుతో పనిచేయువాడు ఏదీ దాచుకొననివాడు 
తెలివిగా కార్యారంభం చేసేవానికి సాధించరాని పనులేవి ఉండవు. 
జ్ఞానియే మనలో శ్రేష్ఠుడు 
సర్వమూ అస్థిరమైన ఈ లోకమునందు ధర్మమొక్కటే స్థిరమైంది. 
అధర్మమం వంశనాశనానికి, ధర్మం వంశవృద్ధికి కారణం అవుతుంది. 
ఆశకు దాసులైనవారు లోకానికంతకు దాసులే. 
తల్లి, తండ్రి, మిత్రుడు - వీరే సహజముగా ప్రతి ఒక్కరికి హితులైనవారు. 
మానవుడు తన నడవడిని యత్నంతో చక్కబరచుకోవాలి. 
స్వార్జిత ధనంతో జీవనయాత్ర గడుపుట ఉత్తమం. 
స్త్రీలు పూజింపబడుచున్న చోట్లనే దేవతలు సంచరిస్తారు. 
ఎవడూ ఎవనికి స్వతహాగా మిత్రుడూ కాడు, శత్రువూ గాడు. 
సత్పురుషులెన్నడు ఆపత్సమయాలలో అధైర్యం చెందరు. 
శత్రువు ఎంత అల్పుడైనప్పటికీ ఎంతో బాధాకరుడుగా పరిణమిస్తాడు. 
ధన సంపాదన చాలా కష్టం - సంపాదించిన దానిని రక్షించుట మరీ కష్టం. 
'నేను ఈ పని చేయగలను ' అనుకుంటే - మీరు సగం విజయం సాధించినట్లే
సౌందర్యమే సత్యం............ సత్యమే సౌందర్యం. 
మనిషికి తన జీవితంలో సత్యం పలకాలి........... ప్రియమైన మాటలు పలకాలి. అయితే ప్రియం కానప్పుడు, అ సత్యాన్ని పలకకుండా ఉండడమే శ్రేయస్కరం. 
అందానికీ, కళ్ళకీ అవినాభావ సంబంధం ఉంటుంది
సరస హృదయం ఉన్నవారు సాధారణముగా మృదువైన స్వభావము కలిగి ఉంటారు 
మనం మంచివారితో సాంగత్యం చేస్తూ జీవనం సాగిస్తుంటే, చెడు గుణాలు సైతం మంచి గుణాలుగా పరిగణింపబడుతుంటాయి. 
ఆలోచనల యుద్దంలో పుస్తకాలే అసలైన అస్త్రాలు 
వైరం అంతమయ్యేది మృత్యువుతోనే 
మంచి మనషుల మనసులు వెన్నలా ఉంటాయి 
ప్రపంచంలో ఎన్నో రకాల యుద్దాలు ఉంటాయి. అయితే మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నిటినీ మించిన మహాసంగ్రామం లాంటిది.
విద్యావంతులమైతే మన దగ్గర అక్షయ పాత్ర ఉన్నట్టే
బలం ఉండటం గొప్పకాదు, దాన్ని సరిగా ఉపయోగించుకోవటమే గొప్పతనం. 
అపారంగా ఇవ్వడం కాదు, అవసరం బట్టి ఇవ్వడమే నిజమైన ఔదార్యం అనిపించుకుంటుంది. 
ఎవరూ తప్పులెన్నలేని విధముగా చేసి చూపాలనుకునేవారు ఎప్పటికీ ఏ పనీ చేయలేరు. 
దేహం స్నానంతో శుభ్రమవుతుంది, మనసు జ్ఞానంతో శుభ్రమవుతుంది. 
డబ్బు, అధికారం కోసం సాగే పరుగు పందెంలో ముందుగా ఓడేవి ధైర్యం, నిజాయితీ
స్నేహం దుఃఖాన్ని భాగిస్తుంది, సంతోషాన్ని హెచ్చిస్తుంది. 
జీవితంలో తప్పులు అందరు చేస్తారు. వాటిని సరిదిద్దుకొనే వారే విజేతలుగా నిలుస్తారు. 
క్రమ సంపాదనతో చేసే విందు భోజనం కన్నా, కష్టార్జితంతో తాగే గంజి ఎంతో సంతృప్తిని ఇస్తుంది.  
న మనస్సు నిర్మలంగా ఉంటే ప్రపంచం మొత్తం స్వర్గంగానే కనిపిస్తుంది
ముందూ వెనకా ఆలోచించకుండా వాగ్దానాలు ఇచ్చేవారు వాటిని నెరవేర్చలేరు
మంచి అలవాట్లు రావాలంటే మంచి వాళ్ళతోనే స్నేహం చేయాలి
భాగ్య రోగులకు సేవ చేయడం కన్నా మించిన పుణ్యకార్యం మరేదీ లేదు
కోపం మనశ్శాంతిని దూరం చేస్తుంది.
న వ్యక్తిత్వం మనం చేసే పనుల్లో కనిపిస్తుంది.
క్రమ సంపాదనతో చేసే విందు భోజనం కన్నా, కష్టార్జితంతో తాగే గంజి ఎంతో సంతృప్తినిస్తుంది
నుషుల్లో వైరానికి అయిదు కారణాలుంటాయి - స్త్రీలు, ఆస్తిపాస్తులు, వాక్కులు,కులమత ద్వేషాలు, ఎప్పుడో 
    తెలిసో తెలియకో చేసిన అపరాధాలు 
సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే, ఇక మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డూ, ఆపూ ఉండవు 
ల్లితండ్రులు తమ సంతానానికి అందించినవాటికి ప్రతిఫలం యీ సృష్టి లోనే లేదు 
విజ్ఞానం లేని జీవితం , నూనే లేని దివ్వెలాంటిది 
 స్వేదాన్ని శక్తిగా మార్చి బిడ్డలను శక్తిమంతులుగా తీర్చిదిద్దేది అమ్మ ఒక్కటే 
త్మ విమర్శ చేసుకొనేవాళ్లే వికాస మార్గంలో నడుస్తారు. 
నసు  ప్రశాంతముగా ఉంటే, ప్రపంచం మొత్తం ప్రశాంతముగా ఉన్నట్లు కనిపిస్తుంది. 
నం ఒక్క నిముషం కోపంగా ఉన్నామంటే, ఒక్క నిముషం సంతోషానికి దూరమైనట్టే. 
వ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. సేవ అలవరచుకో పెత్తనం కాదు .
దుటి వారిపై అసూయ పడుతున్నామంటే అది మన ఆరోగ్యానికే చేటని గ్రహించాలి. 
కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే !
మంచి ఆలోచనలు ఆరోగ్యాన్నియిస్తాయి.చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చి పెడతాయి. 
రొకరిని హింసించి ఆనందించడం పాశవికమైన చర్య.
ద్ధకం మనిషి బద్ధ శత్రువు లాంటిది.
కంచు మ్రోగునట్లు కనకం మ్రోగునా.
నీరు పల్లమెరుగు నిజం దేముడెరుగు.
సత్యమాడుట పిరికి పందల గుణం.
నిజాన్ని నిర్భయముగా చెప్పవలెను.
హంకారం మనషుల మధ్య దూరాలను పెంచుతుంది.
నం సరిఅయిన జ్ఞానం సంపాదించిననాడు ఇతర మతాలతో సంఘర్షణకు దిగకుండా ఉంటాం.
ఠినమైన విద్య అంటూ ఏది లేదు, అయితే దాన్ని ఇష్టపడి చదవకపోతే అది కష్టంగా అనిపిస్తుంది.
డ్డున నిలిపిన నావకు ఏ ప్రమాదం జరుగదు.కానీ దాన్ని తయారుచేసింది సముద్రం లోనికి పంపడానికే కదా!
జీ వితంలో భయం లేకుండా, ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలు సాదించగలరు.
ధైర్య సాహసాలు. ప్రతిభ ప్రతీ మనిషి విజయానికి సోపానాలు.
ప్రశంస పన్నీరు వంటిది, దాన్ని వాసన చూసి వదిలేయాలే తప్ప తాగుతూ కూర్చోకూడదు.
రులను నిందించటం కాదు, ఎప్పటికప్పుడు నీ తప్ప్పులు తెలుసుకొని సరిదిద్దుకో.అప్పుడే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోగలవు.

Telugu Grammar - Sandhulu

పట్నాలు = పట్నము + లు = లు,ల,న లసంధి
నెచ్చెలి = నెఱ + చెలి = ప్రాతాదిసంధి
ప్రత్యక్షం = ప్రతి + అక్షం = యణాదేశసంధి
పల్లెటూరు = పల్లె + ఊరు = టుగాగమసంధి.
మామయ్య = మామ+ అయ్య = అత్వసంధి
మాయమ్మ = మా + అమ్మ = యడాగమసంధి.
సంవత్సరాది = సంవత్సర + ఆది = సవర్ణదీర్ఘసంధి
చైత్రారంభం = చైత్ర + ఆరంభం = సవర్ణదీర్ఘసంధి
స్వార్థం = స్వ + అర్థం = సవర్ణదీర్ఘసంధి
చెల్లాచెదరు = చెదరు + చెదరు = ఆమ్రేడిత సంధి
అత్యాధునికం = అతి + ఆధునికం = యణాదేశ సంధి
సున్నపురాయి = సున్నము + రాయి = పుంప్వాదేశ సంధి
అత్యద్భుతం = అతి + అద్భుతం = యణాదేశ సంధి
మహోజ్జ్వలం = మహా + ఉజ్జ్వలం = గుణసంధి
వైభవోపేతం = వైభవ + ఉపేతం = గుణసంధి
అమరారామం = అమర + ఆరామం = సవర్ణదీర్ఘ సంధి
నవ్యాంధ్ర = నవ్య + ఆంధ్ర =  సవర్ణదీర్ఘ సంధి
గంభీరోపన్యాసము = గంభీర + ఉపన్యాసము = గుణసంధి 
ప్రాణములైన = ప్రాణములు + ఐన = ఉకార సంధి 
భారతీయులెల్లరని = భారతీయులు + ఎల్లరని = ఉకారసంధి 
మహత్తరోపన్యాసం = మహత్తర + ఉపన్యాసం = గుణసంధి 

వ్యతిరేఖ పదాలు

నిజం  Xఅబద్ధం ప్రధానం  X అప్రధానం 
జాగ్రత్త X అజాగ్రత్త అబద్దం X  నిజం 
శత్రువు X మిత్రుడు                              సత్యం X అసత్యం                
ఉదయం X సాయంకాలంబలవంతుడు X బలహీనుడు
పగలు X రాత్రిబయట X లోపల
అల్పుడు X అనల్పుడు స్త్రీ X పురుషుడు 
సాధ్యం X అసాధ్యం ప్రతిష్ట X అప్రతిష్ట 
పెద్ద X చిన్న సమీపం X దూరం 
అపరాధి X నిరపరాధి మర్యాద X అమర్యాద 
మంచి X చెడు మంచి X చెడు 
దోషి  X నిర్ధోషి నేస్తం X విరోధి 
అపరాధులు X నిరపరాధులు గౌరవం X అగౌరవం
ఆసక్తి X అనాసక్తి సత్యం X అసత్యం 
ఉత్సాహం X నిరుత్సాహం ఇష్టత X అనిష్టత, అయిష్టత 
అగ్ర X అంత్య శక్తి X అశక్తి 
స్పృశ్యులు X అస్పృశ్యులు నిర్మలము X మలినము 
ప్రేమ X ద్వేషం సజ్జనుడు X దుర్జనుడు
కీడు X మేలు పుణ్యం X పాపం
సత్యం X అసత్యంసుమతి X కుమతి
నిజం  Xఅబద్ధంప్రధానం  X అప్రధానం 
జాగ్రత్త X అజాగ్రత్తఅబద్దం X  నిజం
శత్రువు X మిత్రుడుఆసక్తి X అనాసక్తి
గౌరవం X అగౌరవంఅపరాధులు X నిరపరాధులు 
నేస్తం X విరోధిదోషి  X నిర్ధోషి
మంచి X చెడుమంచి X చెడు 
మర్యాద X అమర్యాద అపరాధి X నిరపరాధి
సమీపం X దూరంపెద్ద X చిన్న
ప్రతిష్ట X అప్రతిష్టసాధ్యం X అసాధ్యం
సత్యం X అసత్యంఉదయం X సాయంకాలం
స్త్రీ X పురుషుడు బలవంతుడు X బలహీనుడు
పగలు X రాత్రిబయట X లోపల
అల్పుడు X అనల్పుడు

Telugu - prakruti vikruti

తెలుగు - ప్రకృతి వికృతి 
సంస్కృత సమములు ప్రకృతులు, సంస్కృత ప్రాకృత భవములు వికృతులు.
                             
నీరము - నీరు
కష్టం - కస్తిలేఖ - లేకసుఖం - సుకం
నిత్యము - నిచ్చలుగర్భము - కడుపుపక్షము - పక్క
చిత్రము - చిత్తరువుఅక్షతలు - అక్షింతలుకాగదం - కాగితం
ఫలకం - పలకసాక్షి - సాకిరిప్రాంతం - పొంత
సూక్ష్మము - సుంతయాత్ర - జాతరకవి - కయి
ఓష్ఠము - ఔడుసూక్తి - సుద్దిరాట్టు - ఱేడు
బంధము - బందముద్వంద్వము - దొందము, దొందుస్నిగ్ధము - నిద్దము
మర్యాద - మరియాదఈర్ష్య - ఈసుకంఠము - కుత్తుక
ఛాయ - చాయభక్తి - బత్తిరత్నము - రతనము
సపత్ని - సవతిరాజ్ఞి - రాణిఆజ్ఞ - ఆన
సహాయము - సాయముసహజము -  సాజముసర్పము - సప్పము
సుధ - సుద్ద సుఖము - సుకముసింహము - సింగము 
సూచి - సూదిశుకము - చిలుక సుభగము -  సొబగు
సూక్తి - సుద్దిస్తంభము - కంబముస్థూలము - తోలము
స్పటికము - పటిక స్నానము - తానముస్నేహము - నెయ్యము
స్వతంత్రము - సొంతముస్రావము - జావస్వర్ణము -  సొన్నము
హింగువ - ఇంగువస్వామిని - సానిస్వామి - సామి  
హిమము -  ఇవముహృదయము - ఎదఛాయ - చాయ
తాంబూలము -  తమలముజలౌకము - జలగజట - జడ
తామరసము - తామరతింత్రిణి - చింతతుండము - తొండము
తాలము - తాడి తిథి - తేదీ తీరము - దరి
మేఘము -  మెయిలుతుషారము - తుంపరతురుష్కుఁడు - తురక
యముఁడు -  జముఁడుమేషము - మేక మేధస్సు - మెదడు 
యమున - జమునయజ్ఞము - జన్నముయంత్రము - జంత్రము
యాత్ర - జాతరయత్నము - జతనములాక్ష - లక్క
రహటము - రాట్నముయామము  - జాము యోధుఁడు -  జోదు
రాక్షసుఁడు  - రక్కసుఁడుయౌవనము - జవ్వనముయోగి - జోగి 
రాజభారము - రాయబారమురథము - అరదమురత్నము - రతనము 
రోషము - రోసమురాజహంస - రాయంచరాత్రి - రాతిరి 
లక్ష్మి - లచ్చిరాశి - రాసిరాజసము - రాయసము
వంశము - వంగడమురేఖ - రేక రూప్యము - రూపాయి  
ద్యూతము - జూతముదేవి  - దేవేరి వటకము - వడియము
ద్రోణిక - దొన్నె దోషము - దోసముదైవము - దయ్యము  
నాట్యము - నట్టువ దౌష్ట్యము - దుండగముదోషకము - దోసె 
నిద్ర - నిదుర నీరము - నీరునిర్బరము - నిబ్బరము
మరీచము - మిరియము యక్షులు - జక్కులుభూతము - బూచి
మర్యా ద -  మరియాదమలినము - మకిలిమల్లి - మల్లియ
మనుష్యుఁడు - మానిసిమాన్యము - మన్నెము మాణిక్యము - మానికము
మార్జిక - మజ్జిగ ముకుళము - మొగ్గ ముక్తము - ముత్తెము
మూర్ఖుఁడు - మొద్దు  ముఖశాల - మొగసాలముఖము - మొగము 
మృత్యువు - మిత్తిమృత్తిక - మట్టిముగ్ధ - ముగుద
పక్షి - పక్కిమృగము - మెకము మూలిక - మొక్క
 పంక్తి - బంతినౌక - నావనీరాజనము -  నివ్వాళి
పశువు - పసరముపరిహాసము - పరేచకముపద్యము - పద్దెము
మంత్రణము - మంతనముమంటపము - మండపము  పాదుకలు - పావుకోళ్ళు
పిష్టము - పిండిపార్శ్వము - ప్రక్కమతి - మది
పీఠము - పీటపుండ్రకము - బొట్టుపుణ్యము - పున్నెము
పూరిక - బూరెపూజాకరుఁడు -  పూజారి పుస్తకము -  పొత్తము
పృష్టము - పెరడుపృథివి - పుడమి
పూర్ణిమ - పున్నమి
 ప్రధాని - ప్రగ్గడ ప్రతిమ - బొమ్మప్రతిజ్ఞ - ప్రతిన 
సంభ్రమము - సంబరముసక్తు - సత్తు(పేలపిండి)సన్యాసి - సన్నాసి 
సంజ్ఞ - సైగసంతతి - సంతుసంతోషము - సంతసము
లాంగలము - నాగలిశృంగారము - సింగారము శ్రీ  - సిరి
శిరోనామము - చిరునామశిశువు - నిసుఁగు శీతము - సీతువు
శర్కర - చక్కెరశాస్త్రము - చట్టముశిఖ - సిగ
శకునము - సకినముశక్తి  - సత్తిశయ్య - సెజ్జ
వ్యవహారము  - బేహరమువ్యాఖ్యానము -  వైనముశంక -   జంకు
వేత్రము - బెత్తమువైద్యుఁడు - వెజ్జువ్యర్ధము - వమ్ము
విద్య - విద్దె విష్ణువు - వెన్నుఁడువృద్ధి - వడ్డి
వటువు - వడుగువర్ణము - వన్నెవిజ్ఞాపనము -  విన్నపము
ప్రాకారము -  ప్రహరి బిడాలము - పిల్లి   భరణి - బరిణె 
ప్రయాణము -  పయనముభాండము - బానభల్లము -  బల్లెము
త్రినగము - తెనుఁగుత్యాగము - చాగము భిక్షము - బిచ్చము
త్రిలింగము - తెలుగుతృటి - చిటికతృతీయ - తదియ
పారదము - పాదరసముపాయసము - పాసెముత్వక్కు - తొక్క
దభ్రము - దబ్బరదేవాలయము - దేవళముపారావతము -  పావురము
గ్రంథి - కంతిఘంట - గంటఘటము - కడవ
గౌరవము -  గారవముగృహము - గీముగోధూమము -  గోధుమ
గృధ్రము - గద్దదృఢము- దిటము   దిక్కు - దెస 
 దర్భ -  దబ్బ   చేష్ట -  చేతదేవుఁడు -  దేవర  
చేలము - చీరగార్ధభము - గాడిదగుచ్ఛము - గుత్తి
కులాయము - గూడుకూర్పాసము - కుబుసముక్రాంతి -  కార్తె  
చతురస్రము - చదరముచిత్రము -   చిత్తరువుచిహ్నము - చిన్నె
ఖని - గనిగర్తము - గుంటగహ్వరము - గుహ
క్షారము - కారముక్షేమము - సేమముఖడ్గము - కగ్గము
కాష్టము - కట్టెకుండీ - కుండచతురంగము - చదరంగము
కార్యము - కర్జముకావటి -  కావడి కావ్యము - కబ్బము
కర్తి - కత్తికాకము- కాకికాచము - గాజు
కన్య - కన్నె కబళము - కవళము కర్తరి - కత్తెర
కండూతి -  కండుకంథా - గంతకంద - గడ్డ 
హనుమంతుడు - అనుమడు  ప్రశ్న - పన్న                గర్వం - గరువం                        
కథ - కత బుద్ధి - బుద్ది శాస్త్రం - చట్టం 
అడవి - అటవి రాశి - రాసి ఆజ్ఞ - ఆన 
దేవాలయం - దేవళం స్వామి - సామి నగరం - నగరు 
రత్నం - రతనం పట్టణం - పట్నం శ్రీలు - సిరులు 
ఖండము - కండ భక్తి - బత్తి కావ్యము - కర్జము 
ఋషులు - రుసులు స్థలము - తలము గర్వము - గరువము 
కథ - కత భాగ్యము - బాగెము భంగము - బన్నము 
పుస్తకము - పొత్తము భూమి - బూమి శ్రీ - సిరి 
ప్రాణము - పానము వ్యర్థ - పేద ఫలము - పండు 
శక్తి - సత్తి ఫలము - పండు బృంగారము - బంగారము 
గుణము - గొనము గౌరవము - గారవము శాస్త్రము - చట్టము 
రత్నము - రతనము కాకి - కాకము రాజు - ఱేడు 
పుణ్యము - పున్నెము కార్యము - కర్జము స్నానము - తానము 
సత్యము - సత్తెము భక్తి - బత్తి ఆహారము - ఓగిరము 
భాష - బాస పక్షి - పక్కి రాత్రి - రాతిరి 
గృధము - గద్ద విద్య - విద్దె ఆశ్చర్యము - అచ్చెరువు 
అక్షరము - అక్కరము పుస్తకము - పొత్తముపృథ్వి - పుడమి 
భిక్షము - బిచ్చము ఆకాశము - ఆకసం కార్యము - కర్జము 
శ్రీ - సిరి పుష్పము - పూవు గుణము - గొనము 
భక్తి - బత్తి స్థిరము - తిరము భుజము - బుజము 
స్తంభము - కంబము కీర్తి - కీరితి రాక్షసుడు - రక్కసుడు 
తపస్వి - తపసి పురి - ప్రోలు రూపము - రూపు 
త్యాగము - చాగము, తేగహితము - ఇతము ఆశ - ఆస 
కృష్ణుడు - కన్నయ్య గర్వము - గరువము స్వమ్ - సొమ్ము 
సుఖము - సుగము కులము - కొలము ఫలము - పండు 
శక్తి - సత్తి కృష్ణుడు - కన్నడు, కన్నయ్య లక్ష్మి - లచ్చి 
స్త్రీ - ఇంతి విద్య - విద్దె అగ్గి - అగ్ని 
నిమిషము - నిముసముహృదయం - ఎద, ఎడదసింహం - సింగం
పక్షి - పక్కిగుణము - గొనముగృహము - గీము
చంద్రుడు - చందురుడుజట -  జడతీరము - దరి
గర్వం - గరువముగౌరవం -  గారవముదీపము - దివ్వె 
ఆహారం - ఓగిరం పక్షము - పక్కనిజము - నిక్కము
గర్భము -  కడుపుబ్రహ్మ - బమ్మశయ్య - సెజ్జ
భృంగారం - బంగారం సముద్రం - సంద్రంసంతోషం - సంతసం
సుఖం - సుకందక్షిణ -  దక్కినంముఖము - మొగం  
ఘటము - కడవకార్యం - కర్జము థము - అరదము
ఆశ్చర్యము -  అచ్చెరువుఅంకము - అంకె అంకుశము - అంకుసము
అంగుష్ఠము - అంగుటము అంచలము - అంచు అంతఃపురము - అంతిపురము
అక్షతలు  - అక్షింతలుఅక్షరము - అక్కరముఅగాధము - అగడ్త
అటవి - అడవిఅద్భుతము - అబ్బురముఅధికము -  అదనము 
అనాధ - అనదఅన్యాయము - అన్నెముఆహారము - ఓగిరము 
ఇచ్ఛ - ఇచ్చఇష్టిక - ఇటుకఈర్ష్య - ఈసు  
ఉపాధ్యాయుఁడు - ఒజ్జ ఋక్షము - రిక్కఋషి - రుసి
అపూర్వము -  అపురూపముఅప్సరస - అచ్చరఅమావాస్య - అమవస
అర్ధరాత్రి - అద్దమరేయిఅర్పణము - అప్పనముఆందోళిక - అందలము 
ఆజ్ఞ - ఆనఆధారము - అదరువుఆరంభము - ఆరబము
ఆర్య - అయ్యఆలస్యము - ఆలసముఆశ్చర్యము - అచ్చెరువు
ఆశ్రయము - ఆసరాకుంతి - గొంతికుటీరము - గుడిసె
 కుడ్యము - గోడకుమారుఁడు - కొమరుఁడుకురరీ -  గొర్రె 
కుర్కురము - కుక్కకులము - కొలముకంఠము - గొంతు
కంబళము - కంబళికక్ష - చంకకఠారు - కటారి 

తెలుగు సొంత వాక్యాలు

ముగ్ధులు = సంతోషం పొందినవారు
మా పాఠశాలలో సుమతీ శతకంలోని వంద పద్యాలనూ ఆపకుండా అప్పజెప్పిన విజయ  ప్రతిభకు అందరూ ముగ్ధులు అయ్యారు.
పునీతం = పవిత్రం
రాముడు, కృష్ణుడు, బుద్ధుడు మొదలైన మహనీయుల పాదాల స్పర్శతో మన నేల పునీతమైంది.
వైభవోపేతం = గొప్పదనంతో కూడుకొన్నది.
మా ఊళ్ళో ప్రతి సంవత్సరం వైభవోపేతంగా తిరునాళ్ళు జరుగుతాయి.
జగజ్జేగీయమానం = లోకంలో మిక్కిలి కొనియాడబడినది.
జగజ్జేగీయమానమైన మన సంస్కృతిని గురించి ప్రతి భారతీయుడూ విధిగా తెలుసుకోవాలి.
దగ్గర = చేరువ
ఉపాధ్యాయుని చేరువలో ఉంటే విజ్ఞానం పెరుగుతుంది.
దశదిశలు: గాంధీ గారి కీర్తి ప్రపంచంలో దశదిశలా వ్యాపించింది 
కాళ్ళు కడుగు: అత్తమామలు అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు 
అభ్యాగతుడు: అభ్యాగతుడు స్వయంగా విష్ణుమూర్తి వంటివాడని పెద్దలంటారు. 
సిరి మూటకట్టుకొని పోవడం: ఏ వ్యక్తికీ సిరి మూట కట్టుకొని పోవడం శక్యం కాదు. బ్రతికుండగానే దానధర్మాలు చేసుకోవాలి. 
సత్యహీనుడు: సత్యహీనునిగా బ్రతకడం కంటే మరణము మేలు 
మానధనులు : మానధనులే నిజమైన కోటీశ్వరులు 
చేతులొగ్గు: ఎవరి దగ్గరా చేతులొగ్గి యాచించడం మంచిపని కాదు. 
కురచగుట : దర్జీ కుట్టిన చొక్కా, మా పిల్లవాడికి కొద్దిగా కురచయ్యింది. 
పలికి లేదనుట : మా వంశ చరిత్రలో పలికిలేదనడం ఎప్పుడూ లేదు. 
నిరాఘంటంగా - అడ్డులేకుండా
వాక్యము: రాజకీయ నాయకులు నిరాఘంటంగా మాట్లాడతారు. 
చిలుక పలుకులు - సొంతంగా ఆలోచించకుండా మాట్లాడే మాటలు
వాక్యం: చిన్నపిల్లల మాటలు చిలుకపలుకులుగా వినిపిస్తారు. 
అధిక్షేపించుట - ఆక్షేపించు
వాక్యం: విద్యార్థులు గురువుల మాటని అధిక్షేపించాలి. 
భగ్నోత్సాహులు - ఉత్సాహం కోల్పోయినవారు
వాక్యం: నా మిత్రుడు పరీక్షలలో తక్కువ మార్కులు రావడం వలన భగ్నోత్సాహులుగా ఉన్నాడు. 
బ్రతుకు తెరువు: చాలా మంది బ్రతుకుతెరువుకై పట్టణానికి వలస వస్తారు. 
ఎదురొడ్డు - స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారితో ఎదురొడ్డి పోరాడారు. 
కుదువ పెట్టు - రామయ్య అప్పు తీర్చుటకై తన ఆస్తిని కుదువపెట్టారు. 
తలదాచుకొను - పూర్వం కాలినడక ప్రయాణికులకు తలదాచుకొనేటందుకు సత్రాలు నిర్మించేవారు. 
వారాలు చేసుకొనటం -  పూర్వం డబ్బు లేని పిల్లలు వారాలు చేసుకొని చదువుకొనేవారు. 
వెనుకాడు - పిల్లలు మంచి పనులు చేయడానికి వెనుకాడవద్దు. 
జవదాటు - పిల్లలు పెద్దల మాటలను జవదాట వద్దు. 
సమయ స్పూర్తి - ఆపదలు కలిగినప్పుడు భయపకుండా సమయ స్పూర్తి తో వాటిని జయించాలి. 
తుడిచి పెట్టుకొని పోవు - అగ్ని ప్రమాదం సంభవించి నా స్నేహితుని ఆస్తి మొత్తం తుడిచి పెట్టుకొని పోయింది. 
కన్నుమూయు - ధర్మయ్య తన ఆస్తిని పిల్లలకు రాసియిచ్చి కన్ను మూశారు. 
 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు