చెప్పుకొనకు మిచ్చి - చెప్ప కేగు లచ్చి | హాని పనికి దడువు - హాస్య మెపుడు విడువు |
గట్టి మాట నుడువు - గర్వ మంత విడువు | సఖుల కీడు బాపు - సాటి వాని మేపు |
కల్ల మాట వినకు - కన్న చోట జనకు | వచన మొకటి పలుకు - వాదు కెపుడు నళుకు |
ఓటు మాట విడువు - ఓర్పు మించి నడువు | రచ్చ కెక్క నేల - రవ్వ సేయ నేల |
ఐక్య మిచ్చు బలము - ఐన దెల్ల శుభము | యతుల నింద వలదు - యాచ నెపుడు తగదు |
ఏక మగుట యొప్పు - ఏడ్చుటెపుడు ముప్పు | మనసు నణచి పట్టు - మోహ మణగ గొట్టు |
ఊర గలసి మనుము - ఊని పనుల గనుము | పాప బుద్ధి కలచు - పాము చెలిమి చెరచు |
దుడుకు మాని నడువు - దురుసు తనము విడువు | నయము తప్ప వద్దు - నడత చెడిన దిద్దు |
రూక లేని వాడు - పోక చేయ లేడు | అలుక పూన రాదు - అతివ గొట్ట రాదు |
దేవ దేవ రమ్ము - కావు మయ్య మమ్ము | జూట తనము తప్పు - జూద మాడ ముప్పు |
గొప్ప చెప్పుకోకు - ముప్పు కలుగు నీకు | మాట తప్పబోకు - మంచి విడువ బోకు |
పోరు నష్టము - పొందు లాభము | పగటి పూట నిద్ర - పనికి చేటు గదరా! |
కత్తి పోటు కన్న - కలము పోటు మిన్న | ఆటలాడు చోట - అలుక పూన రాదు |
వెండికొండ - మొండిబండ | చిట్టిఉడత - పొట్టిబుడత |
తెలుగుతల్లి - వెలుగువెల్లి | పాముపడగ - పాలబుడగ |
బొమ్మలాట - నిమ్మతోట | వెన్నదొంగ - చిన్నకొంగ |
పూరిపాక - కోతిమూక | రైలుబండి - తేలుకొండి |
బావిగిలక - బావపిలక | పాలగచ్చు - పట్టుకుచ్చు |
పూలతోట - జోలపాట | గాలివాన - కొండకోన |
పచ్చిగడ్డి - చిచ్చుబుడ్డి | రావిచెట్టు - బావిగట్టు |
బాటసారి - మాటకారి | పాపబుగ్గ - లేతమొగ్గ |
కన్నతల్లి - చిన్నచెల్లి | ఏరువాక - కుక్కతోక |
నల్లబల్ల - తెల్లపిల్ల | రూక లేని వాడు - పోక చేయలేడు |
చాడి చెప్ప వద్దు - కూడి ఉంటె ముద్దు | మాతృదేశ సేవ - మానవతకు త్రోవ |
పెద్ద లాడు మాట - చద్ది బువ్వ మూట | వాదు లాడ జనకు - చేదు మాట వినకు |
కట్టు లేని నోరు - కట్ట తెగిన ఏరు | ఆలిలేని ఇల్లు - నారి లేని విల్లు |
ప్రియము లేని విందు - నయము గాని మందు | నీతిలేని వాడు - కోతి కంటే పాడు |
దేవ దేవ రమ్ము - కావు మయ్య మమ్ము | చదువురాని మొద్దు - కదలలేని యెద్దు |
అలుక పూన రాదు - అతివ గొట్ట రాదు | రూక లేని వాడు - పోక చేయ లేడు |
ఏక మగుట యొప్పు - ఏడ్చు టెపుడు ముప్పు | ఊర గలసి మనుము - ఊని పనుల గనుము |
తెలుగు ప్రాసవాక్యాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment