ఒరులేయని యొనరించిన - పద్యం
ఒరులేయని యొనరించిన
నరవర! యప్రియము దన మనంబున కగు దా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్.
భావము : ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో ఆ పని ఇతరుల విషయంలో చేయగూడదు.
అదే ధర్మం.
బాగుంది.
ReplyDeleteఇది ఏ పర్వం లోనిది?
ReplyDeletesanthi parvam
ReplyDeleteప్రసాద్ గారూ
ReplyDeleteఈ పద్యం భీష్ముడు ధర్మరాజుతో రాజధర్మాలు వివరిస్తున్న సందర్భం లోనిదా? వివరించగలరు.
అవును.. శాంతి పర్వం పంచమాశ్వాసం లో 220 వ పద్యం..
Deleteఅదే ధర్మం అనే కాదండీ అదే ultimate ధర్మం అని భావం.
ReplyDeleteఆంధ్రపత్రిక దినపత్రికలో నిత్యం సంపాదకీయం కాలమ్ పైన ఈ పద్యం ప్రచురించేవారు.