వేమన పద్యం - వంపుకర్రగాచి
వంపుకర్రగాచి వంపు తీర్చగవచ్చు
కొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపరాదు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము: వంకర కర్రను మంటలో వేడిచేసి తిన్నగా చేయవచ్చు, కొండలను పిండి చేయవచ్చు. కఠిన చిత్తుని దయావంతునిగా మార్చలేము.
No comments:
Post a Comment