Pages

Famous Telugu Poems - Dharmatatvagnulu

                               ప్రసిద్ధ తెలుగు పద్యాలు - ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని 
ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని 
        యధ్యాత్మవిదులు వేదాంతమనియు 
నీతివిచక్షణుల్ నీతిశాస్త్రంబని 
           కవివృషభులు మహాకావ్యమనియు 
లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని 
           యైతిహాసికు లితిహాస మనియుఁ 
బరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్ఛ 
           యంబని మహిఁ గొనియాడుచుండ 
వివిధవేదతత్త్వవేది వేదవ్యాసుఁ 
డాదిముని పరాశరాత్మజుండు 
విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై 
పరఁగుచుండఁ జేసె భారతంబు. 

భావము: భారతాన్ని ధర్మశాస్త్రం తెలిసినవారు ధర్మశాస్త్రంగా భావించారు. ఆధ్యాత్మకోవిదులు వేదాంతం అన్నారు. నీతివేత్తలు నీతి శాస్త్రం అన్నారు. కవిశ్రేష్ఠులు మహాకావ్యం అన్నారు. ఐతిహాసకులు ఇతిహాసం అన్నారు. పౌరాణికులేమో పురాణాల కాణాచి అన్నారు. ఈ విధంగా వేదవ్యాసుడు భారతాన్ని సర్వులూ ప్రశంసించేలా రచించారు.                                   
           

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు