Pages

Famous Telugu Poems - Saaramatim Gavindrulu

ప్రసిద్ధ తెలుగు పద్యాలు - సారమతిం గవీంద్రులు 
సారమతిం గవీంద్రులు ప్రసన్నకథాకలితార్థయుక్తి లో 
నారసి మేలునా, నితరు లక్షరరమ్యత నాదరింప నా 
నారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు దెనుంగునన్ మహా 
భారతసంహితారచనబంధురుఁ డయ్యె జగద్ధితంబుగన్ 

భావము:  నన్నయ భారతాన్ని అనువదించడంలో మూడు ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యత నిచ్చారు. అవి: 1. ప్రసన్నమైన కథాకలితార్థయుక్తి   2. అక్షర రమ్యత   3. నానాచిరార్థ సూక్తి నిధిత్వము. భారత ఆంధ్రీకరణలో ఈ మూడు గుణాలకు నన్నయ ప్రాముఖ్యం ఇచ్చిన విషయాన్ని ఈ పద్యం సూచిస్తుంది. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు