కాలింగ్ బెల్ ఎలా పనిచేస్తుంది?
ఇప్పుడు ప్రతి ఇంటి తలుపు ముందు, ఆఫీసుల్లో కాలింగ్ బెల్ కనిపిస్తుంది. విద్యుదయస్కాంత ప్రభావం ఆధారంగా కాలింగ్ బెల్ పనిచేస్తుంది.
->ఇందులో విద్యుదయస్కాంతం, మెత్తని ఇనుముతో తయారైన "ఆర్మేచర్"ఉంటుంది. ఆర్మేచర్ కు చిన్న సుత్తి వంటి పరికరం అమర్చి ఉంటుంది. ఈ సుత్తి డొప్ప వంటి గాంగ్ ను నిరంతరం కొడుతుంది. దీనివల్ల స్విచ్ నొక్కినంత సేపు బెల్ మోగుతూనే ఉంటుంది.
-> మీరు స్విచ్ నొక్కినప్పుడు విద్యుదయస్కాంతం చుట్టూ ఆర్మేచర్, కాంటాక్ట్ స్ప్రింగ్, స్క్రూ గుండా విద్యుత్ ప్రవహిస్తుంది.
-> విద్యుత్ ప్రవాహం వల్ల లోహపు చుట్టలో అయస్కాంతత్వం కలుగుతుంది.
-> దీనివల్ల ఆర్మేచర్ దగ్గరకు జరుగుతుంది. ఈ కదలిక వల్ల సుత్తి గాంగ్ ను తాకుతుంది. దాంతో ధ్వని పుడుతుంది. అంటే కాలింగ్ బెల్ మోగుతుంది.
No comments:
Post a Comment