బహుళైశ్చిక ప్రశ్నలు - అర్థాలు - 10వతరగతి
కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలను గుర్తించి, వాటి సంకేతాన్ని (అ, ఆ, ఇ, ఈ) రాయండి.
1. రాయుడు గారి క్షేత్రములో మంచి పంటలు పండాయి.
అ) పొలం ఆ) తోట ఇ) గృహం ఈ) నేల (అ)
2. పాపాత్ములకు నిరయం తప్పదు.
అ) శిక్ష ఆ) జైలు ఇ) నరకం ఈ) స్వర్గం (ఇ)
3. మా తాత గొప్ప వదాన్యుడు
అ) ఉపన్యాసకుడు ఆ) కవి ఇ) దాత ఈ) బలవంతుడు (ఇ)
4. కర్ణుని ఈవి లోక ప్రసిద్ధం.
అ) పరాక్రమం ఆ) త్యాగం ఇ) స్నేహ ధర్మం ఈ) న్యాయం (ఆ )
5. నీవు అలతి ప్రయత్నంతో సాధించావు.
అ) గొప్ప ఆ) మహత్తరం ఇ) విశేషం ఈ) కొద్ది (ఈ)
6. పెళ్ళికి వర్ణి అంగీకరించాడు.
అ) బ్రహ్మచారి ఆ) వరుడు ఇ) పురోహితుడు ఈ) రంగులు వేసేవాడు (అ)
7. కారం తింటే జిహ్వ చుర్రుమంటుంది.
అ) నోరు ఆ) నాలుక ఇ) శిరస్సు ఈ) ముక్కు (ఆ)
8. చాలా మంది రాక్షసులు నీరజభవుని ప్రార్థించి వరాలు పొందారు.
అ) విష్ణువు ఆ) శివుడు ఇ) బ్రహ్మ ఈ) దేవత (ఇ)
9. నేను చెప్పింది నీ కర్ణము లోనికి ఎక్కదా?
అ) మనస్సు ఆ) గుండె ఇ) చెవి ఈ) ముఖం (ఇ)
10. భారత స్వాతంత్య్ర సమరములో పెక్కు మంది వీరులు స్వర్గస్థులయ్యారు.
అ) చరిత్ర ఆ) కలహం ఇ) యుద్ధం ఈ) మరణము (ఇ)
11. ఎన్ని క్రతువులు చేసినా రాని పుణ్యం పరోపకారం వల్ల వస్తుంది.
అ) దానం ఆ) యజ్ఞం ఇ) స్త్రోత్రం ఈ) ప్రార్థన (ఆ)
12. ఈ రాజ్యంలో కుబ్జులు ఎక్కువగా ఉన్నారు.
అ) సత్తువ లేనివారు ఆ) పొట్టి వారు ఇ) పొడుగు వారు ఈ) బలవంతులు (ఆ)
13. ఆమె లోచనములు తళతళ మెరుస్తున్నాయి.
అ) చెవులు ఆ) కన్నులు ఇ) చేతులు ఈ) హారములు (ఆ)
14. పోతన మంచి హాలికుడు.
అ) కార్మికుడు ఆ) వ్యవసాయదారుడు ఇ) రచయిత ఈ) పనివాడు (ఆ)
15. హరికీ హరునికీ నీరజభవునికీ భేదము లేదు.
అ) బ్రహ్మ ఆ) విష్ణువు ఇ) శివుడు ఈ) సూర్యుడు (ఇ)
16. బ్రహ్మ తన దయితయైన సరస్వతీ సహితంగా వచ్చారు.
అ) స్త్రీ ఆ) భార్య ఇ) ఇంతి ఈ) వనిత (ఆ)
17. నీ వాంఛితము తప్పక నెరవేరుతుంది.
అ) కోరిక ఆ) సంకల్పము ఇ) ప్రేమ ఈ) అభీష్టము (అ)
18. దానము ఇవ్వాలంటే దాత చరణములు కడగాలి.
అ) చేయి ఆ) పాదము ఇ) కాలు ఈ) హస్తము (ఆ)
No comments:
Post a Comment