Pages

బహుళైశ్చిక ప్రశ్నలు - ప్రకృతి - వికృతులు - 10వతరగతి

  బహుళైశ్చిక ప్రశ్నలు - ప్రకృతి  - వికృతులు  - 10వతరగతి 

కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు గుర్తించి, వాటి సంకేతాన్ని (అ, ఆ, ఇ, ఈ) రాయండి. 

1. నీ భాగ్యము కొద్దీ మంచి వరుడు దొరికాడు. 

అ) బాగేమ్       ఆ) బాగెము           ఇ) భాగ్యం         ఈ) బాగ్గేమ్            (ఆ)

2. మీ ధాత్రి నిన్ను పిలుస్తోంది.  

అ) భూమి        ఆ) దాది             ఇ) తల్లి          ఈ) దాయి             (ఆ)

3. నీ వరుడు సిరిసంపదలు కలవాడు.  

అ) శ్రీ        ఆ) సిరీ             ఇ) లక్ష్మి         ఈ) సంపద             (అ)

4. మంత్రగాడు చేసే చేష్టలు ఆశ్చర్యం కలిగించాయి. 

అ)ఆస్చేర్యం        ఆ) అచ్చెరువు             ఇ) ఆజ్ఞ          ఈ) అద్భుతం              (ఆ)

5. నీ పాలనలో ధర్మము నాలుగు పాదాలా సాగుతోంది. 

అ) దరమం        ఆ) దమ్మము            ఇ) దర్మం         ఈ) దర్శనం             (ఆ)

6. నీ కులములో అంతా యోగ్యులే. 

అ) కులం       ఆ) కొలము             ఇ) జాతి          ఈ) వంశము             (ఆ)

7. విద్య లేని వాడు వింత పశువు. 

అ) విద్య       ఆ) విజ్జె             ఇ) విద్దె          ఈ) విజ్ఞానం              (ఇ)

8. "బ్రహ్మ" అనే పదానికి వికృతిని గుర్తించండి 

అ) బ్రాహ్మణుడు        ఆ) బమ్మ (లేక) బొమ్మ        ఇ) బ్రహ్మి          ఈ) వాణి             (ఆ)

9. కొలము, పారుడు, అచ్చెరువు, మృత్యువు, యశము, భూమి - వీనిలో ప్రకృతి పదాలను గుర్తించండి 

అ) కొలము, పారుడు, మృత్యువు      ఆ) మృత్యువు, యశము, భూమి           

 ఇ) పారుడు,  భూమి,  మృత్యువు      ఈ) అచ్చెరువు, కొలము, యశము            (ఆ)

10. "అసము" - అనే దాని ప్రకృతి.  

అ) యశస్సు        ఆ) యశః             ఇ) యశము          ఈ) ఆశ              (ఇ)

11. విప్రుడు, భూతము - అనే పదాల వికృతులను గుర్తించండి 

అ) వెన్నుడు, దెయ్యం        ఆ) విప్ర, భూతః      

ఇ) పారుడు, భూచి               ఈ) బ్రాహ్మణుడు, భూతము              (ఇ)

12. వడుగు, దక్కినము - వీని ప్రకృతులను గుర్తించండి 

అ) వటుకడు, దక్షిణము        ఆ) వర్ణి, దక్షిణము       

ఇ) దక్కినం, బ్రహ్మచారి     ఈ) వర్ణము, దాక్షిణ్యం              (అ)

13. మృత్యువు, భద్రము - అనే పదాల వికృతులు  

అ) మరణం, బద్రము        ఆ) మిత్తి, పదిలము 

ఇ) చావు, భద్రం          ఈ) చావు, పుట్టుక            (ఆ)

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు