బహుళైశ్చిక ప్రశ్నలు - వ్యుత్పత్త్యర్థములు - 10వతరగతి
కింది వ్యుత్పత్త్యర్థములకు సరియైన పదాన్ని గుర్తించి, వాటి సంకేతాన్ని (అ, ఆ, ఇ, ఈ) రాయండి.
1. నీరజము నందు పుట్టినవాడు.
అ) చేప ఆ) తాబేలు ఇ) కప్ప ఈ) నీరజభవుడు (ఈ)
2. మూడడుగులచే భూమిని కొలిచినవాడు.
అ) ఇంద్రుడు ఆ) శివుడు ఇ) త్రివిక్రముడు ఈ) బ్రహ్మ (ఇ)
3. విశ్వమును భరించేవాడు.
అ) విశ్వంభరుడు ఆ) శివుడు ఇ) శుక్రుడు ఈ) బలి (అ)
4. భృగువంశమున పుట్టినవాడు.
అ) బలి ఆ) భార్గవుడు ఇ) ఇంద్రుడు ఈ) వ్యాసుడు (ఆ)
5. విష్ణువు నాభి కమలము నుండి పుట్టినవాడు.
అ) ఇంద్రుడు ఆ) పారాశర్యుడు ఇ) వేదవ్యాసుడు ఈ) నీరజభవుడు (ఈ)
6. మిక్కిలిగా ఇచ్చేవాడు.
అ) దాత ఆ) ప్రదాత ఇ) వదాన్యుడు ఈ) విధాత (ఇ)
7. భోజనకాలమున వచ్చిన అతిథి.
అ) అతిథి ఆ) అభ్యాగతుడు ఇ) దాత ఈ) యాచకుడు (ఆ)
8. "హరుడు" - అనే పదానికి వ్యుత్పత్తి.
అ) భక్తుల హృదయాలను హరించేవాడు ఆ) హరించేవాడు
ఇ) భక్తుల పీడలను సర్వమూ హరించేవాడు ఈ) పద్మమున పుట్టినవాడు (ఇ)
9. భక్తుల హృదయాలను ఆకర్షించేవాడు.
అ) హరి ఆ) హరుడు ఇ) హారుడు ఈ) భక్తహారి (అ)
10. "మాణవకుడు" - అనే పదం యొక్క వ్యుత్పత్త్యర్థము
అ) మనువు యొక్క అల్పమైన సంతానము ఆ) మను పుత్రుడు
ఇ) మనువుకు మనుమడు ఈ) మనుష్య జాతివాడు (అ)
11.విశ్వమంతా వ్యాపించినవాడు.
అ) విశ్వంభరుడు ఆ) విష్ణువు ఇ) విశ్వవ్యాపి ఈ) రుద్రుడు (ఆ)
12. "దానవులు" అనే పదానికి వ్యుత్పత్తి.
అ) దనువు వల్ల పుట్టినవారు ఆ) అదితికి పుట్టినవారు
ఇ) దితికి పుట్టినవారు ఈ) దనువుకు సోదరులు (అ)
13. "బ్రహ్మ" అనే పదం యొక్క వ్యుత్పత్త్యర్థము
అ) విష్ణువునకు పుత్రుడు ఆ) సరస్వతికి భర్త
ఇ) ప్రజలను వర్ధిల్ల చేయువాడు ఈ) పద్మమున పుట్టినవాడు (ఇ)
14. "భాషించునది" అనే పదానికి వ్యుత్పత్తి.
అ) మాట ఆ) చిలుక ఇ) భాష ఈ) చర్చ (ఇ)
No comments:
Post a Comment