Pages

Bhaskara Shataka Padyalu - Kanaka Chera

భాస్కర శతక పద్యం - అర్థం - కానక చేరఁ 

కానక చేరఁ బోల దతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం 
దా నది నమ్మి వానికడ దాయఁగఁబోయిన హాని వచ్చు న 
చ్చో నదియెట్లనం గొఱఁకు చూపుచునొడ్డిన బోను మేలుగా 
బోనని కానకాసపడి పోవుచుఁ గూలదె కొక్కు భాస్కరా!

అర్థం: పాపాత్ముఁడెన్ని విధముల నమ్మించినను వాని చెంతఁ జేరరాదు. వాని తేనెమాటలకు మోసపోయి దగ్గఱఁ జేరిన యెడల తప్పక హాని కలుగును. తిండి మీది యాశచే పందికొక్కు బోనునఁబడి ప్రాణమును బాయుటలేదా?


No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు