Pages

Bhaskara Shataka Padyalu - Kattada yaina

 భాస్కర శతక పద్యం - అర్థం  - కట్టడ యైన 



కట్టడ యైన యట్టి నిజకర్మము చుట్టుచు వచ్చి యేగతిం 

బెట్టునొ పెట్టినట్లనుభవింపక తీరదు కాళ్ళుమీఁదుగాఁ

గిట్టక వ్రేలుఁ డంచుఁదల క్రిందుగఁ గట్టిరె యెవ్వరైన నా 

చెట్టున గబ్బిలంబులకుఁ జేసిన కర్మముగాక భాస్కరా!

తాత్పర్యము:  గబ్బిలములను, ఇతర లెవ్వరును తలక్రిందుగా చెట్టునకు వ్రేలాడ గట్టకున్నను, వానికి చుట్టుకున్న కర్మముచే నవి అట్లు వ్రేలాడవలసి వచ్చెను. అట్లే ఎవరికైనను విధి విధానమును దప్పించుకొనుటకు వీలులేదు. అది యనుభవించియే తీరవలెను. 


No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు