Pages

అంచిత చతుర్థ జాతుడు - చమత్కార పద్యం

అంచిత చతుర్థ జాతుడు - చమత్కార పద్యం  

అంచిత చతుర్థ జాతుడు 

పంచమమార్గమున నేగి ప్రథమ తనూజన్ 

గాంచి, తృతీయం బప్పురి 

నించి ద్వితీయంబు దాటి నృపుకడ కరిగెన్ 

ఇందులో అర్థాన్ని పంచభూతాల సంఖ్యను బట్టి అన్యయించుకొనవలెను. 

పంచ భూతాలు: 1. పృధ్వి - భూమి; 2. ఆపః - నీరు; 3. తేజ - అగ్ని; 4. వాయు - గాలి; 5. ఆకాశత - ఆకాశము 

చతుర్థ జాతుడు: నాల్గవదైన వాయువుకు పుట్టిన ఆంజనేయుడు. 

పంచమమార్గము: అయిదవదైన ఆకాశమార్గాన వెళ్లి 

ప్రథమ తనూజన్: మొదటిదైన పృధ్వి - భూమి పుత్రిక సీతను చూచి 

తృతీయంబు: మూడవదైన అగ్నిని(ఆలంకా పట్టణంలో ఉంచి కాల్చి)

ద్వితీయంబు: రెండవదైన నీటిని (సముద్రాన్ని) దాటి రాముని వద్దకు వచ్చాడు అని భావం. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు