Pages

భగవద్గీత శ్లోకాలు - మొదటి అధ్యాయం - అర్జునవిషాదయోగం

 భగవద్గీత శ్లోకాలు - మొదటి అధ్యాయం - అర్జునవిషాదయోగం


సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ 
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్.        //19//

పదచ్ఛేదము: సః, ఘోషః, ధార్తరాష్ట్రాణామ్, హృదయాని, వ్యదారయత్, నభః, చ, పృథివీమ్, చ, ఏవ, తుములః, వ్యనునాదయన్.

టీకా: చ = మరియు; సః = ఆ; తుములః = భయంకరమగు; ఘోషః = శబ్దము; నభః = ఆకాశమునూ; చ = మరియు; పృథివీమ్ = పృథివినీ; ఏవ = కూడ; వ్యనునాదయన్ = ప్రతిధ్వనింప చేస్తూ; ధార్తరాష్ట్రాణామ్ = (మీ పక్షాల వారైన) ధార్తరాష్ట్రుల యొక్క; హృదయాని = గుండెలను; వ్యదారయత్ = బ్రద్దలుచేసినది.

తాత్పర్యము : ఆ భయంకరమైన శబ్దము భూమ్యాకాశాలను ప్రతిధ్వనింపజేయుచు,(మీ పక్షంవారైన) ధార్తరాష్ట్రుల హృదయాలను బద్దలు చేసినది. 

1 comment:

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు