Pages

సుభాషిత పద్యాలు - విద్యా వివాదాయ - అర్థం

 సుభాషిత పద్యాలు - విద్యా వివాదాయ - అర్థం

విద్యా వివాదాయ, ధనం మదాయ, శక్తిః పరపీడనాయ!
ఖలస్య సాధోర్విపరీతమేతజ్జనాయ దానాయ చ రక్షణాయ!!

అర్థం: దుర్మార్గులు దేన్నయినా దుర్వినియోగం చేస్తారు. వారు విద్యావంతులైతే, తమ విద్యను వివాదాలు రేకెత్తించడానికి ఉపయోగిస్తారు. ధనవంతులైతే, దాంతో మదించి అహాన్ని తృప్తి పరచుకోవడానికి ఖర్చు చేస్తారు. వీటికి అధికారం కూడా తోడైతే ఇతరులను పీడిస్తారు. సజ్జనులు వీరికి పూర్తి విరుద్ధంగా విద్యను సమాజ శ్రేయస్సుకు, ధనాన్ని, అధికారాన్ని ఇతరులకు సాయం చేయడానికి, రక్షణ కల్పించడానికి ఉపయోగిస్తారు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు