Pages

మొదటి అధ్యాయం - అర్జునవిషాదయోగం - అథ వ్యవస్థితాన్దృష్ట్వా

 మొదటి అధ్యాయం - అర్జునవిషాదయోగం - అథ వ్యవస్థితాన్దృష్ట్వా

అథ వ్యవస్థితాన్దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః 
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. 
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే
అర్జున ఉవాచ 
సేనయో రుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత. //20-21//.

పదచ్ఛేదము: అథ, వ్యవస్థితాన్, దృష్ట్వా, ధార్తరాష్ట్రాన్, కపి ధ్వజః,
ప్రవృత్తే, శస్త్రసంపాతే, ధనుః, ఉద్యమ్య, పాండవః, హృషీకేశమ్, తదా, వాక్యమ్, ఇదమ్, ఆహ, మహీపతే, సేనయోః, ఉభయోః , మధ్యే, రథమ్, స్థాపయ, మే, అచ్యుత.

టీకా: మహీపతే = ఓ రాజా; అథ = అనంతరం; కపిధ్వజః = కపిధ్వజుడైన; పాండవః = అర్జునుడు; వ్యవస్థితాన్ = యుద్ధమునకు మోహరించి నిలచిన; ధార్తరాష్ట్రాన్ = ధృతరాష్ట్రుని కుమారులను; దృష్ట్వా = చూచి; తదా = ఆ (వారల); శస్త్రసంపాతే ప్రవృత్తే = శస్త్రములు పడు సమయాన; ధనుః = గాండీవమును; ఉద్యమ్య = ఎత్తి; హృషీకేశమ్ = శ్రీ కృష్ణ పరమాత్మతో; ఇదమ్ = ఈ; వాక్యమ్ = వచనమును; ఆహ = చెప్పెను; అచ్యుత = ఓ అచ్యుతా; మే = నా యొక్క; రథమ్ = రథమును; ఉభయోః = రెండు; సేనయోః = సేనల ; మధ్యే = నడుమ; స్థాపయ = నిలుపుము.

తాత్పర్యము : ఓరాజా ! అనంతరము కపిధ్వజుడైన అర్జునుడు సేనాముఖమున స్థిరముగా నిలచి ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులను చూచి శస్త్ర ప్రయోగమునకు తలపడునట్టి ఆ సమయములో తన గాండీవ ధనుస్సు నెత్తి హృషీకేశుడగు శ్రీకృష్ణునితో ఇట్లనెను ఓ అచ్యుతా ! నా రథమును ఉభయసేనలకు మధ్య నిలుపుము .

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు