Pages

మొదటి అధ్యాయం - అర్జునవిషాదయోగం - యావదేతాన్నిరీక్షే

 మొదటి అధ్యాయం - అర్జునవిషాదయోగం - యావదేతాన్నిరీక్షే

యావదేతాన్నిరీక్షే హం యోద్ధుకామానవస్థితాన్ 
కైర్మయా సహ యోద్ధవ్య మస్మిన్రణ సముద్యమే.         //22//

పదచ్ఛేదము: యావత్, ఏతాన్, నిరీక్షే, అహమ్, యోద్ధుకామాన్, అవస్థితాన్, కైః, మయా, సహ, యోద్ధవ్యమ్, అస్మిన్, రణసముద్యమే.

టీకా : యావత్ = ఎంత వరకు; అహమ్ = నేను; అవస్థితాన్ = యుద్ధ సన్నద్ధులై; యోద్ధుకామాన్ = పోరాడదలచిన; ఏతాన్ = ఎదుటి పక్షమునకు చెందిన వీరులను; నిరీక్షే = బాగా చూడగలుగుదునో; అస్మిన్ = ఈ; రణసముద్యమే = యుద్ధ కార్యములో; మయా = నాకు; కైః = ఎవరెవరి; సహ = తో; యోద్ధవ్యమ్ = పోరాడవలసియున్నదో (అంత వరకు రథమును నిలిపి ఉంచుము) .

తాత్పర్యము: యుద్ధానికి సన్నద్ధులై పోరాడుటకు ఉవ్విళ్ళూరుచున్న  శత్రుపక్షపు యోధులను బాగుగా గమనించి ఎవరెవరితో యుదము చేయవలసియున్నదో బాగా చూచునంతవరకు రథమును నిలుపుడు.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు