Pages

మొదటి అధ్యాయం - అర్జునవిషాదయోగం - యోత్స్యమానాన

 మొదటి అధ్యాయం - అర్జునవిషాదయోగం - యోత్స్యమానాన

యోత్స్యమానాన వేక్షే హం య ఏతే త్ర సమాగతాః 
ధార్త రాష్ట్రస్య దుర్బుద్ధే ర్యుద్ధే ప్రియ చికీర్షవః. //23//

పదచ్ఛేదము: యోత్స్యమానాన్, అవేక్షే, అహమ్, యే, ఏతే, అత్ర, సమాగతాః, ధార్తరాష్ట్రస్య, దుర్బుద్ధేః, యుద్ధే, ప్రియచికీర్షవః.

టీకా: దుర్బుద్దేః = దుష్టబుద్ధియగు; ధార్తరాష్ట్రస్య = దుర్యోధనుని; యుద్ధే = యుద్ధములో; ప్రియచికీర్షవః = మేలు కోరునట్టి; యే = ఎవరెవరు; ఏతే = రాజులు; అత్ర = ఈ సేనలో; సమాగతాః = వచ్చి యున్నారో; యోత్స్యమానాన్ = యోధులను; అహమ్ = నేను; అవేక్షే = చూచెదను.

తాత్పర్యము: దుర్బుద్ధియగు దుర్యోధనుని మేలు కోరి ఏయే రాజులు యుద్ధము చేయగోరి ఈ సేనలో వచ్చి చేరిరో ఆయా యోధులను నేను చూచెదను.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు