Pages

భర్తృహరి సుభాషితాలు - మొదల జూచిన గడు గొప్ప పిదప గుఱచ

భర్తృహరి సుభాషితాలు - మొదల జూచిన గడు గొప్ప పిదప గుఱచ 

 మొదల జూచిన గడు గొప్ప పిదప గుఱచ 
యాది కొంచెము తర్వాత నధికమగుచు
దనరు, దినపూర్వ పరిభాగ జనితమైన
ఛాయపోలిక కుజన సజ్జనుల మైత్రి 
అర్థం: దుర్మార్గులతో స్నేహము ఉదయకాలపు నీడవలె ముందు పెద్దగా ఉండి క్రమముగా క్షీణించిపోవును. సజ్జనుల మైత్రి సాయంకాలపు నీడ వలె ముందు చిన్నదిగా వుండి క్రమముగా వృద్ధి పొందుచుండును. కావున ఈ రెండింటిలో యుక్తమైన దానినే బుద్ధిమంతుడు పొందవలెను.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు