Pages

భర్తృహరి సుభాషితాలు - విద్యచే భూషితుండయి వెలయుచున్న

భర్తృహరి సుభాషితాలు - దానము భోగము నాశము 

 విద్యచే భూషితుండయి వెలయుచున్న 
దొడరి వర్జింప నగుజుమి దుర్జనుండు 
చారుమాణిక్య భూషిత శస్తమస్త
కంబు గల పన్నగము భయంకరము గాదె. 
అర్థం: దుర్జనుడైన మనుష్యునికి గొప్ప విద్య ఉన్నను అతడు వదలదగినవాడే అగును. ఏలననగా పాము తల యందు గొప్ప రత్నము ఉన్నను భయంకరమైన దగుటచేత దాని దరికి పోరాదు కదా.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు