Pages

భాస్కరశతకం - పద్యం

 భాస్కరశతకం - పద్యం 

ఒక్కడె చాలు నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైనదాఁ 
జక్కనొనర్ప, కౌరవులసంఖ్యులు పట్టిన ధేనుకోటులం 
చిక్కగనీక తత్ప్రబలసేన ననేక శిలీముఖంబులన్ 
మొక్కబడంగా జేసి తుది ముట్టడె యొక్క కిరీటి భాస్కరా!!
వివరణ : ఎంతకష్టమైన పనినయినా సాధించడానికి ఒక్కడు చాలు. ఆ ఒక్కడూ గొప్పబలవంతుడై ఉంటే సరిపోతుంది. వందమంది కలిసి పనిచేసినా, వాళ్ళలో బలంలేకపోతే ఎంతచిన్నపని ఐనా చేయలేరు. ఫలితం తీసుకురాలేరు. ఉదాహరణకు దుర్యోధనుడు మొదలైన వందమంది కౌరవులు, ద్రోణుడు మొదలైన మహావీరులు-అందరూ కలిసి విరాటమహారాజురాజ్యంలోని కోటానుకోట్ల గోవులను పట్టుకొని తమదేశానికి తీసుకుపోతున్నారు. వీరాధివీరుడైన అర్జునుడొక్కడే వేలబాణాలు వేసి అంతమందినీ ఓడించి గోవులనన్నింటినీ విరాటుడికి అందించాడు.
       దీన్నిబట్టి ఏమర్థమయిందీ మనకు - శక్తిగలవాడు, బలం ఉన్నవాడు, ఒక్కడైనా వేలమందిని ఓడించి విజయం పొందుతాడు. ఒక్కయుద్ధం చేసేగాదు, ఏ కార్యాన్ని చేపట్టినా శక్తిసామర్థ్యాలు ఉంటే ఆ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతాడు. ధైర్యం, మేధావిత్వం అవసరం. కాబట్టి సాహసంతో ముందుకు దూకి, మధ్యలో పనిని ఆపకుండా తన శక్తినంతా ఉపయోగించి గెలుపొందడమే మనిషి చేయవలసినపని అని భాస్కరశతకంలోని ఈ పద్యం చెబుతోంది. ఆ నీతిని ఆచరించడమే మనందరి పని. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు