సుమతీ శతకము - వినదగు నెవ్వరు చెప్పిన
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కని కల్ల నిజాము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
భావము : ఎవరు ఏమి చెప్పినా వినాలి. విన్న వెంటనే తొందర పడకుండా బాగా ఆలోచించాలి.
అలా ఆలోచించి నిజానిజాలను తెలుసుకున్నవాడే తెలివయినవాడు.
నిజము (నిజాము కాదు) తెలిసిన అని సరి చేయగలరు
ReplyDelete