Pages

సమాసాలు - (విగ్రహ వాక్యాలు)

సమాసాలు - (విగ్రహ వాక్యాలు)
పదము 
విగ్రహ వాక్యము 
సమాసము పేరు 
1     వేద శాఖలు              వేదముల యొక్క శాఖలు    షష్టి తత్పురుష సమాసము
2వృక్ష వాటికవృక్షముల యొక్క వాటిక షష్టి తత్పురుష సమాసము
3ఆది కావ్యముఆది యైన కావ్యమువిశేషణ పూర్వపద కర్మ ధారయ సమాసము  
4నవ రసములు తొమ్మిది సంఖ్య గల రసములు ద్విగు సమాసము 
5ధీర పురుషులు ధీరులైన పురుషులు విశేషణ పూర్వపద కర్మ ధారయ సమాసము
6ఎండ వానలు ఎండ మరియు వానలు ద్వంద్వ సమాసము 
7తల్లి తండ్రులు తల్లి మరియు తండ్రి ద్వంద్వ సమాసము 
8దశావతారాలు పది సంఖ్య గల అవతారాలు ద్విగు సమాసము
9.జీవిత గమనం జీవితం యొక్క గమనం షష్టి తత్పురుష సమాసము
10. వెయ్యి రూపాయలు వెయ్యి సంఖ్య గల రూపాయలు ద్విగు సమాసము
11. మంచి పేరు మంచిదైన పేరు విశేషణ పూర్వపద కర్మ ధారయ సమాసము
12. మూడు అంశాలు మూడు సంఖ్య గల అంశాలు ద్విగు సమాసము
13. ఆలోచన స్పష్టత ఆలోచన యొక్క స్పష్టతషష్టి తత్పురుష సమాసము
14. మంద బుద్ధి మందమైన బుద్ధి విశేషణ పూర్వపద కర్మ ధారయ సమాసము
15.జీవధనములు జీవమును, ధనమును ద్వంద్వ సమాసము
16. యువతీయువకులు యువతియు,        యువకుడును ద్వంద్వ సమాసము
17. దశదిక్కులు దశ సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసము
18. భూత ప్రేతములు భూతమును, ప్రేతమును ద్వంద్వ సమాసము

11 comments:

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు