వేమన పద్యం - ఎవరి గుణములను
ఎవరి గుణములను యేమన్న మానవు
చక్క జేయరాదు కుక్కతోక
గడుసురాలు మగని గంప బెట్టమ్మురా
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము: ఎవరి గుణాల్ని గురించి ఎంత చెప్పినా వారా గుణాల్ని మానుకోరు. కుక్కతోకకి గల సహజమైన వంకరను సరిచేయడం అసంభవం. ఒక్కొక్క స్త్రీ అతి గడుసు తనంతో మొగుణ్ణి గంపలో పెట్టి అమ్మేస్తుంది.
No comments:
Post a Comment