వేమన పద్యం - వేరుపురుగు చేరి
వేరుపురుగు చేరి వృక్షంబు జెఱుచును
చీడపురుగు చేరి చెట్టు జెఱచు
కుత్సితుండు చేరి గుణవంతు జెఱుచురా
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము: వేరుకి పట్టిన పురుగు వృక్షాన్ని పాడు చేస్తుంది. చీడపురుగు చెట్టుని పట్టి పాడు చేసినట్లే దుర్మార్గుడు గుణవంతుణ్ణి చేరి అతన్ని పాడు చేస్తుంటాడు.
No comments:
Post a Comment