భాస్కర శతక పద్యాలు - ఏల సమస్తవిద్యలు
ఏల సమస్తవిద్యలు నొకించుక భాగ్యము గల్గియుండినన్
జాలు ననేకమార్గముల సన్నుతి కెక్కన దెట్లోకో యన్
రాలకు నేడ విద్యలు తిరంబుగ దేవరరూపు చేసినన్
వ్రాలి నమస్కరించి స్రవంబులు వెట్టరె మీఁద భాస్కరా!
తాత్పర్యము: రాళ్లు విద్యలు నేర్వకున్నను, వానిని దేవతా విగ్రహముగా చేసినచో వాని పాదముల మీద పడి, పూవులతో వానిని మానవులు పూజింతురు. అటులనే కొంచెము భాగ్యమైనను గల మానవుడు అనేక రీతులుగ పొగడబడుచుండును కాని, విద్యలు నేర్చినందున కాదు.
No comments:
Post a Comment