Pages

Telugu Grammar - Samasamulu # 1

తెలుగు వ్యాకరణం - సమాసములు 
ప్రశ్న: సమాసమనగా నేమి?
సమాధానము: (1) వేరు వేరు అర్థములు గల పదములు ఏక పదముగా  సమసించుటను "సమాసము" అందురు. 
                          సీత - ఈ పదమునకు 'జానకి' అని అర్థం.  
                          పతి - ఈ పదమునకు 'భర్త' అని అర్థం. 
                 ఈ రెండు పదములు కలిసి 'సీతాపతి' అను సమాసము ఏర్పడినది. అది 'రాముఁడు' అని ఒకే అర్థము కలిగి యున్నది. 

(2) సమాసములో మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదమును ఉత్తర పదమనియు అందురు. 

(3) సమాసమునందు మొదటి పదము యొక్క విభక్తి ప్రత్యయము లోపించును. బహుత్వము తెలుపు 'ల' ప్రత్యయము లోపించదు. 
                       ఉదా: హరి యొక్క బాణము = హరిబాణము 
                                  గొఱ్ఱెల యొక్క మంద = గొఱ్ఱెలమంద 

(4) కొన్ని అక్షరములను గాని, పదములను గాని తగ్గించి చెప్పుటకు సమాసము ఉపయోగపడును. 
                             ఉదా: సీత అరణ్యమునకు వెళ్ళినది. 
                                       రాముఁడు అరణ్యమునకు వెళ్ళినాడు. 
                     ఈ రెండు వాక్యములను కలిపి ఒకే వాక్యము  చేయుటకు సమాసము ఉపయోగించును. 
                          ఉదా: సీతారాములు  అరణ్యమునకు  వెళ్ళిరి. 

ప్రశ్న: విగ్రహవాక్యమనగానేమి?
సమాధానము: సమాసము ఏర్పడుటకు ముందున్న విభక్తి ప్రత్యయములతో కూడిన పదములను విగ్రహవాక్యమందురు. 
           ఉదా: రాజు యొక్క పుత్రుఁడు (విగ్రహవాక్యం) - రాజపుత్రుఁడు (సమాసము)

ప్రశ్న: విగ్రహవాక్యము చెప్పుట యనగా నేమి?
సమాధానము: సమాసములో లోపించిన విభక్తి ప్రత్యయమును చేర్చి చెప్పుటను సమాసమునకు విగ్రహవాక్యం చెప్పుట యందురు. 

ఉదా: దశరథుని కొడుకు (సమాసము)
           దశరథుని యొక్క కొడుకు (విగ్రహవాక్యము)
           నా పుస్తకము (సమాసము)
           నా యొక్క పుస్తకము (విగ్రహవాక్యము)
            రాజాజ్ఞ   (సమాసము)
            రాజు యొక్క ఆజ్ఞ  (విగ్రహవాక్యము)

ప్రశ్న : భాషను బట్టి సమాసములు లెన్ని రకములు? అవి ఏవి?
సమాధానము: భాషను బట్టి సమాసములు మూడు రకములు. 
(1) సాంసృతికము             (2) ఆచ్ఛికము                 (3) మిశ్రము 

ప్రశ్న: సాంస్కృతికమనగా  నేమి? ఎన్ని రకములు? వివరింపుము?
సమాధానము: కేవలం సంస్కృత పదములతో గాని, కేవలం తత్సమ పదములతో గాని ఏర్పడిన సమాసమును సాంస్కృతిక సమాసమందురు. 
ఇది రెండు విధములు. అవి: 
1. సిద్ధము            2. సాధ్యము 
1. సిద్ధము: సంస్కృత వ్యాకరణ నియమములచే సమాసములై, తెలుగున తత్సమములుగా గ్రహింపబడిన సమాసములను సిద్ధ సమాసములందురు. 
                  ఉదా: రాజ్ఞః + ఆజ్ఞా = రాజాజ్ఞ 
                            తటాకః + ఉదకము = తటాకోదకము 
2. సాధ్యము: తెలుగు వ్యాకరణ నియమములచే ఏర్పడిన తత్సమ పద సమాసములను సాధ్య సమాసములందురు. 
                         ఉదా: రాజు యొక్క + ఆజ్ఞ = రాజాజ్ఞ 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు