భాస్కర శతక పద్యాలు - ఒక్కడె చాలు
ఒక్కడె చాలు నిశ్చలబలోన్నతుఁ డెంతటి కార్యమైనఁదాఁజక్క నొనర్పఁ గౌరపు లసంఖ్యులు పట్టిన థేనుకోటులం
జిక్కఁగ నీక తత్ప్రబలసేన ననేక శిలీముఖంబులన్
మొక్కవడంగఁ జేసి తుద ముట్టఁడె యొక్క కిరీటి భాస్కరా!
తాత్పర్యము: ఉక్కుగల వాడొక్కడైనను ఎంత ఘనకార్యమైన సాధింపగలడు. మహాబలశాలి యగు నర్జునుడు తా నొక్కఁడైనను పెక్కురు కౌరవవీరుల గెలిచి యావులను మరలింపలేదా?
No comments:
Post a Comment