సోడియం ల్యాంప్ ఎలా పని చేస్తుంది?
వీధి దీపాల్లో కంటికి ఆహ్లాదకరంగా ఉండే ప్రకాశవంతమైన పసుపు రంగులో కాంతిని వెదజల్లే సోడియం ల్యాంప్ ను చూడవచ్చు.
1. సోడియం ల్యాంప్ లో ఇంగ్లీష్ ఆకారంలో ఉండే గాజునాళికలో బేరియం ఆక్సైడ్ పూతపూసిన రెండు టంగ్ స్టన్ లోహపు ఎలక్ట్రోడ్లు ఉంటాయి.
2. గాజునాళికలో నుంచి వాయువును తీసేసి, శూన్యం చేస్తారు. ఈ శూన్యం స్థానంలో కొంచెం నియాన్ వాయువును, కొన్ని సోడియం పలుకులను వేస్తారు. తర్వాత ఆ నాళికకు సీలు వేస్తారు.
3. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ కోసం రెండు ఎలక్ట్రోడ్ ల మధ్య ట్రాన్సఫార్మర్ సాయంతో 400 వోల్టుల విద్యుత్ ను ప్రవహింపచేస్తారు.
4. మొదట్లో నియాన్ వాయువు నుంచి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ వల్ల ఎరుపు రంగు కాంతి వెలువడుతుంది. ఈలోగా సోడియం పరమాణువులు వేడెక్కి, వాటి నుంచి పసుపు రంగు కాంతి వెలువడడం ఆరంభమవుతుంది.
5. నియాన్ వాయువు కన్నా సోడియంలో అయనీకరణ శక్తి ఎక్కువ. కాబట్టి ల్యాంప్ నుంచి సోడియం కాంతి ఎక్కువగా వెలువడి మనకు పసుపు రంగు లైటు కనిపిస్తుంది.
No comments:
Post a Comment