హెయిర్ డ్రయ్యర్ ఎలా పని చేస్తుంది?
జుట్టు ఆరబెట్టుకోవడానికి ఒకప్పుడు సాంబ్రాణి పొగ పట్టేవారు. ఇప్పుడు తడిజుట్టును తొందరగా ఆరబెట్టేందుకు ప్రస్తుతం హెయిర్ డ్రయ్యర్ ను ఉపయోగిస్తున్నారు. హెయిర్ డ్రయ్యర్ ఎలా పనిచేస్తుంది తెలుసుకుందాము:
1. తీగలో నుంచి విద్యుత్ ను ప్రవహింపచేసినప్పుడు తీగ వేడెక్కుతుంది. విద్యుత్ ప్రవాహంలోని ఈ గుణాన్ని "ఎలక్ట్రో థర్మల్ ఎఫక్ట్" అంటారు. ఎలక్ట్రిక్ హీటర్లు, బల్బు మాదిరిగానే హెయిర్ డ్రయ్యర్ కూడా ఇదే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది.
2. డ్రయ్యర్ ఆకారం పిస్టల్ మాదిరిగా ఉంటుంది. దీని పైభాగం ప్లాస్టిక్ తో తయారై ఉంటుంది. దీని లోపల "నైక్రోమ్" అనే లోహంతో తయారైన తీగచుట్ట (కాయిల్) ఉంటుంది. దీనిలోకి విద్యుత్ ప్రవహించగానే వేడెక్కుతుంది.
3. తీగ చుట్ట వెనుక భాగంలో ఒక చిన్న ఫ్యాన్ అమర్చబడి ఉంటుంది. ఫ్యాన్ కు, కాయిల్ కు రెండు వేర్వేరు స్విచ్ లు ఉంటాయి. ఒక స్విచ్ నొక్కగానే ఫ్యాన్ తిరుగుతూ బయట నుంచి గాలిని లోపలి తీగచుట్ట మీదకు విసురుతుంది .
4. రెండో స్విచ్ నొక్కగానే తీగచుట్ట వేడెక్కి, వేడి గాలి డ్రయ్యర్ లో నుంచి బయటకు వస్తుంది. ఈ విధంగా హెయిర్ డ్రయ్యర్ జుట్టును ఆరబెడుతుంది.
It is a very informative and useful post thanks it is good material to read this post increases my knowledge.
ReplyDeleteHair straightener brush company
You are writing some Amazing tips. This article really helped me a lot. Thanks for sharing this blog.
ReplyDeletehair straightener pink