వేమన పద్యం - చెఱకు తీపిలేమి ఁజెత్తనాఁబడునట్లు (మూర్ఖపద్ధతి)
చెఱకు తీపిలేమిఁ జెత్తనాఁబడునట్లు
పరగ గుణములేని పండితుండు
దూఱుపడునుగాదె దోషమటుండఁగ,
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము: చదువుకొన్నందుకు మంచి గుణములుండవలెను. గుణములు లేకుండుట తప్పు. అంతేకాదు, దానివలన నిందయును కలుగును. ఎట్లనగా - చెరకులో తీపి లేనిచో అది చెత్త అనియే చెప్పబడును.
No comments:
Post a Comment