Pages

మూర్ఖోపి శోభతే - సుభాషిత పద్యం - అర్థం

 మూర్ఖోపి శోభతే  - సుభాషిత పద్యం - అర్థం

మూర్ఖోపి శోభతే తావత్సభాయాం వస్త్రవేష్టితః 

తావచ్చ శోభతే మూర్ఖో యావత్కించన్నభాషతే!

అర్థం: చదువు సంధ్యలేవి లేని పరమశుంఠ, మహా మూర్ఖ శిఖామణి కూడా నిండు సభలో అమోఘముగా రాణించవచ్చు. అదెలాగంటారా? చక్కగా మంచి దుస్తులు ధరించి, అలంకరించుకుని గంభీరంగా కూర్చుంటే చాలు. చూసేవాళ్లకు జ్ఞానసంపన్నుడిలాగానే కనిపిస్తాడు. అదెంత సేపంటారా? అతడు నోరు విప్పి మాట్లాడనంత వరకే! నోరు విప్పితే బండారం బయటపడిపోదూ! 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు