Pages

శ్రీ వేమన పద్య సారామృతము - వేమన పద్యాలు # 2

   వేమన పద్యరత్నాకరము -  లోభివాని జంప లోకంబులోపల    

లోభివాని జంప లోకంబులోపల 
మందు పలదు వేరు మతము గలదు 
పైక మడిగినంత చాల భగ్గున పడిచచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: లోభిని చంపడానికి లోకంలో మందేదీ వేరే అక్కర్లేదు. డబ్బడిగితే చాలు లోభి మండి పడి చస్తాడు.

 వేమన పద్యరత్నాకరము -  మాటలెల్ల కల్ల మనసెల్ల దొంగయౌ

మాటలెల్ల కల్ల మనసెల్ల దొంగయౌ 
నేటి ప్రాణమింక? నేటి బ్రతుకు? 
మాట సత్యమైన మరి శతాయుస్యంబు
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం:  మాటలాడితే అన్నీ అబద్దాలే. మనసయితే దొంగ బుద్దే. అటువంటివాడు ఒక్క సత్యమైన పలుకు పలికితే అదే నూరేళ్ళు నిలుస్తుంది.

వేమన పద్యరత్నాకరము -  కలిమినాడు నరుడు కానడు మదమున  

కలిమినాడు నరుడు కానడు మదమున 
లేమినాడు మొదలె లేదు పెట్ట 
కలిమి లేమి లేని కాలంబు గలుగునా?
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: సంపద కలిగిన రోజుల్లో మదంతో సంచరిస్తాడు. ఆ రోజుల్లో ఎవరికైనా కాస్తంత పెట్టడం అనేదే ఉండదు. లేమిలోన యేమీ చేయలేడు యిక కలిమి లేములు లేని కాలం అంటూ ఉంటుందా?

వేమన పద్యరత్నాకరము -  కనియు గానలేడు కదిలింపదానోరు 

కనియు గానలేడు కదిలింపదానోరు 
వినియు వినగలేడు విస్మయమున 
సంపద గలవాని సన్నిపాతక మిది 
విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: సమాజంలో భాగ్యవంతుని దశను వేమన చమత్కారంగా యిలా చెప్తున్నాడు. 
               భాగ్యవంతుడు ఏదైనా సన్నివేశాన్ని చూసి కూడా నోరు మెదపకుండా చూడనట్లే ఉంటాడు. యేదైనా విన్నా కూడా విననట్లే ఉంటాడు. ఇది భాగ్యవంతుని కుండే సన్నిపాత రోగం.

వేమన పద్యరత్నాకరము -  తీర్ప నార్పలేని తీర్పరితన మేల? 

తీర్ప నార్పలేని తీర్పరితన మేల? 
కూర్ప విప్పలేని నేర్పరేల? 
పెట్టి పొయ్యలేని వట్టి బీరములేల?
విశ్వదాభిరామ వినుర వేమ! 

అర్థం: ఒక సమస్యను తీర్చడానికి ఆర్చడానికి గాని సమర్దుడై ఉండాలి. తీర్పరంటే అట్టివాడు. ఒక చిక్కు వచ్చినప్పుడు దాన్ని విప్పడానికి కౌశల్యం ఉన్నవాడే నేర్పరి. పెట్టలేక పొయ్యలేక చెప్పే అసమర్దుని మాటలే కోతలు.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు