Pages

Showing posts with label visheshalu. Show all posts
Showing posts with label visheshalu. Show all posts

How Do Wind Turbines Work? - Do You Know

విండ్ టర్బైన్ 

గాలిమరల ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారని తెలుసు కదా! గాలి మరల్లోని టర్బైన్లలోని విడిభాగాల పనితీరు తెలుసుకుందాం. 

జనరేటర్ : టర్బైన్ లోని రోటర్ తిరిగే శక్తిని జనరేటర్ విద్యుచ్ఛక్తి గా మారుస్తుంది .  ఈ విద్యుత్ ను గ్రిడ్ కు లేదా నిల్వ కేంద్రానికి పంపుతారు. 

నాజిల్.... నాసిలి: ఈ నియంత్రణ విధానం నాజిల్ దిక్కుల్ని నియంత్రిస్తుంది. టర్బైన్ వెనుక టర్బులెన్స్ తగ్గించేందుకు వీలుగా ఈ నాసిలీని తయారుచేస్తారు. 

గేర్ బాక్స్ : రోటర్ కదిలేందుకు గేర్ బాక్స్ తోడ్పడుతుంది.  గాలి వేగం ఆధారంగా రోటర్ వేగం పెరిగి, పవనశక్తి , విద్యుత్ శక్తిగా మారుతుంది. 

బ్లేడ్స్: టర్బైన్ లోని రోటర్ బ్లేడ్స్ మార్చుకునేందుకు అనువుగా ఉంటాయి. గాలి వాలును అనుసరించి బ్లేడ్స్ ఒంపు మారేవిధంగా అమర్చి ఉంటాయి. 

How sodium lamp works - The Sodium Lamp

సోడియం ల్యాంప్ ఎలా పని చేస్తుంది?
వీధి దీపాల్లో కంటికి ఆహ్లాదకరంగా ఉండే ప్రకాశవంతమైన పసుపు రంగులో కాంతిని వెదజల్లే సోడియం ల్యాంప్ ను చూడవచ్చు. 
1. సోడియం ల్యాంప్ లో  ఇంగ్లీష్ ఆకారంలో ఉండే గాజునాళికలో బేరియం ఆక్సైడ్ పూతపూసిన రెండు టంగ్ స్టన్ లోహపు ఎలక్ట్రోడ్లు ఉంటాయి. 

2. గాజునాళికలో నుంచి వాయువును తీసేసి, శూన్యం చేస్తారు. ఈ శూన్యం స్థానంలో కొంచెం నియాన్ వాయువును, కొన్ని సోడియం పలుకులను వేస్తారు. తర్వాత ఆ నాళికకు సీలు వేస్తారు. 

3. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ కోసం రెండు ఎలక్ట్రోడ్ ల మధ్య ట్రాన్సఫార్మర్ సాయంతో 400 వోల్టుల విద్యుత్ ను ప్రవహింపచేస్తారు. 

4. మొదట్లో నియాన్ వాయువు నుంచి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ వల్ల ఎరుపు రంగు కాంతి వెలువడుతుంది. ఈలోగా సోడియం పరమాణువులు వేడెక్కి, వాటి నుంచి పసుపు రంగు కాంతి వెలువడడం ఆరంభమవుతుంది. 

5. నియాన్ వాయువు కన్నా సోడియంలో అయనీకరణ శక్తి ఎక్కువ. కాబట్టి ల్యాంప్ నుంచి సోడియం కాంతి ఎక్కువగా వెలువడి మనకు పసుపు రంగు లైటు కనిపిస్తుంది. 


 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు