Pages

Telugu Chikku Prasnalu

తెలుగు చిక్కు ప్రశ్నలు - జవాబులు
1. తీసిన కొద్దీ పెద్దదయ్యేది ఏది ? (జవాబు - గొయ్యి)
2. ఎలక్ట్రిక్ రైలు తూర్పు నుండి పడమరకు పోతున్నది. గాలి పడమర నుండి తూర్పుగా వీస్తున్నది. రైలు పొగ ఏవైపుగా పోతుంది?(జవాబు - ఎలక్ట్రిక్ రైలుకు పొగే ఉండదు)
3. కాయగాని కాయ మీద కాయగాని కాయ వేస్తే, కుయ్యో, మొఱ్ఱో అన్నాట్ట!
 (జవాబు - తలకాయ మీద మొట్టికాయ)
4. మా దొడ్లో పూల మీద సీతాకోకచిలుకలు వచ్చి వాలినై. పువ్వుకొకటి చొప్పున వాలితే ఒక సీతాకోకచిలుక మిగిలి పోతున్నది. పువ్వుకు రెండు చొప్పున వాలితే, ఒక పువ్వు మిగిలి పోతున్నది. పూలెన్ని? సీతాకోకచిలుకలు ఎన్ని ? (జవాబు - పూలు - మూడు(3); సీతాకోకచిలుకలు - నాలుగు (4))
5. ఆకాశాన్ని ఆ చివరి నుంచీ ఈ చివరి దాకా కప్పి వేసే ముచ్చటైన ఆయుధం ఏది?(జవాబు : ఇంధ్ర ధనుస్సు)
6. పిట్ట గాని పిట్ట, నాలుగు కాళ్ళతో నడుస్తుంది. ఏమిటది?(జవాబు : లొట్ట పిట్ట - ఒంటె)
7. వ్రాత పుస్తకం వెల 3 రూపాయలు. పెన్సిల్ వెల అర్ధ రూపాయి. 100 రూపాయలకు 100 పుస్తకాలు కొనాలి. ఎలా?(జవాబు : 20 పుస్తకాలు 60 రూపాయలు, 80 పెన్సిళ్ళు 40 రూపాయలు, 100 వస్తువులు 100 రూపాయలు)
8. ఎంతమందికి పంచి యిచ్చినా తరగనిది ఏది?(జవాబు : విద్య)
9. ముగ్గురు వర్తకుల్ని అడవిలో నలుగురు దొంగలు పట్టుకొని పోతున్నారు. ఇంతలో "చంపుతా, మింగుతా" అంటూ ఒక భూతం ఎదురైంది. మొదటివాడు చాలా తెలివైనవాడు. భూతంతో ఇలా అన్నాడు "భూతమా! మేము ఏడుగురం వరుసలో నిలబడుతాము. మొదటి నుండి ప్రతి 4 వ వాణ్ణి లెక్కపెట్టి తిను. వంతు వచ్చిన మొదటి నలుగుర్ని తిని నీదారిన నీవుపో". దయ్యం సరే అంది. వర్తకుడు ఏడుగుర్ని ఒక వరుసలో నిలబెట్టాడు. దయ్యం ప్రతి నాలగవ వాణ్ణి లెక్క పెట్టి తినేసింది; నాలుగుసార్లు దొంగల వంతే వచ్చింది. ఒక్క దెబ్బన దొంగలు, దెయ్యం  రెండింటి పీడ వదలించుకున్నాడు వర్తకుడు. ఇందులో అతడు వరుస ఎలా ఏర్పాటు చేశాడు?(జవాబు : వర్తకుల్ని వరుసలో 2,3,7 స్థానాల్లో, మిగిలిన నాలుగు స్థానాల్లో (1,4,5,6,8) దొంగల్ని నిలబెట్టాడు.)
10. పాలుగాని పాలు పాలు, పెంచిన కారుగాని కారు, వరంగాని వరం చేయించుకోటానికి వెళ్ళాడు.(జవాబు : జులపాలు, షావుకారు, క్షవరం)
11. కీలుగాని కీలు, వరిగాని వరిలో వనంగాని వనం కొన్నాడట. (జవాబు : వకీలు, జనవరి, భవనం)
12. ఒక ఆసామికి 9 బర్రెలు ఉన్నాయి. ఒకటో బర్రె ఒక శేరు, రెండోది రెండు శేర్లు, మూడోది మూడు ...... , ఇలా తొమ్మిదో బర్రె 9 శేర్లు పాలిచ్చేవి. ఆ ఆసామి తన ముగ్గురు కొడుకులకు మూడేసి బర్రెల చొప్పున పంచి ఇచ్చాడు. అంతే కాదు, ఒక్కొక్కనికి వచ్చిన మూడు బర్రెలు ఇచ్చే పాలు కూడా సమానమే. అతడు ఎలా పంచాడు? (జవాబు : ఈ పక్క చదరంలో ఒక్కొక్క గడి ఒక బఱ్ఱె అనుకుందాము. అది ఇచ్చేపాలు ఆ గడిలోనే అంకెల్లో చూపాము. ఒకొక్కని వంతుకు మూడు బర్రెలు, 15 శేర్ల పాలు వచ్చాయి. 8 1 6 ------->15 శేర్లు; మూడేసి 3 5 7----->15 శేర్లు; బర్రెలు  4 9 2 -------> 15 శేర్లు)
13. పావుశేరు పాలల్లో పాలెన్ని? (జవాబు : రెండు ('పా' అనే అక్షరం)
14. మామిడి చెట్టెక్కి ఒకడు పండ్లు కోశాడు. రెండవ వాడు ఏరాడు. పండ్లలో రెండు వంతులు కోసినవాడికి, ఒక వంతు ఏరిన వాడికి అనే ఒప్పందం ప్రకారం పంచుకున్నారు. ఏరిన వాడు కొసరి ఒకటి ఎక్కువ తీసుకున్నాడు. దీనితో ఇద్దరి పండ్లు సమానం అయ్యాయి. కోసిన పండ్లెన్ని? ఎవరెన్ని తీసుకున్నారు?
(జవాబు : కోసినవి 6 పండ్లు, పంచుకున్నది 4 + 2; చివరకు 3 + 3)
15. ఇవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం :
వలగాని వల (జవాబు : నవల)
కొమ్ము గాని కొమ్ము (జవాబు : శొంఠి / పసుపు)
కారు గాని కారు(జవాబు : షికారు / పుకారు / పట్టుకారు)
స్త్రీ గాని స్త్రీ (జవాబు : ఇస్త్రీ)
16. నాలుగు అక్షరాల పదం - అర్థం శివుడు, మొదటి అక్షరం తప్పిస్తే, విష్ణువు, మళ్లీ అలాగే చేస్తే భర్త.
(జవాబు : ఉమాపతి - మాపతి - పతి)
17. జూలోని ఒక విభాగంలో పాములూ సాలీడులూ కలిపి ఉన్నాయి. ఆ విభాగంలో మొత్తం 24 తలలు, 64 కాళ్లు ఉన్నాయి. మరి ఆ విభాగంలో ఏవేవి ఎన్నేసి ఉన్నాయో చెప్పగలరా? (సాలీడుకి 8 కాళ్లు ఉంటాయనీ పాముకి కాళ్లు ఉండవనీ తెలుసు కదా!)
(జవాబు : సాలీడులు 8, పాములు - 16)
18. మా తోటలో అందమైన పూలచెట్లు ఉన్నాయి. అయితే ఆ పూల చెట్లపై సీతాకోకచిలుకలు వాలాయి. పువ్వుకు ఒకటి చొప్పున వాలితే ఒక సీతాకోకచిలుక మిగిలిపోతున్నది. పువ్వుకు రెండు చొప్పున వాలితే ఒక పువ్వు మిగిలిపోతుంది. అయితే పూలెన్ని? సీతాకోకచిలుకలు ఎన్ని?
(జవాబు : పువ్వులు - 3, సీతాకోకచిలుకలు  - 4)
జీవన్, తరుణ్, లావణ్య, మహేష్, కమల ఒక బెంచీ మీద కూర్చుని ఉన్నారు. జీవన్ కి కుడివైపు తరుణ్ ఉన్నాడు. జీవన్ కి ఎడమ వైపునా, లావణ్యకి కుడి వైపునా మహేష్ ఉన్నాడు. కమలకి ఎడమవైపు తరుణ్ ఉన్నాడు. అయితే ఎడమ నుంచి కుడికి వారి వరుస చెప్పండి.
(జవాబు : లావణ్య, మహేష్, జీవన్, తరుణ్, కమల)
సన్నీ బన్నీ సినిమాకి వెళ్ళాలనుకున్నారు. అయితే ఏ షోకి వెళ్లాలీ అనే విషయం మీద సన్నీ బన్నీతో ఇలా అన్నాడు. 'మనం వెళ్లవలసిన షో సమయం ఇంగ్లిషులో నాలుగు అక్షరాలతో ఉంటుంది. ఆ పదాన్ని తలకిందులుగా చూసినా ఒకేలా ఉంటుంది. ఇలాంటి నాలుగక్షరాల పదం ఆంగ్లంలో ఇదొక్కటే'. ఇంతకీ వాళ్లు వెళ్లాల్సిన షో ఏది?(Noon)
రాము దగ్గర 100 చాక్లెట్లు ఉన్నాయి. వాటిని అయిదు రోజుల్లో తినాలి. మొదటి రోజు తిన్న చాక్లెట్లకంటే రెండో రోజు ఆరు ఎక్కువగా తినాలి. రెండో రోజుకంటే మూడోరోజు మరో ఆరు ఎక్కువగా....ఈ పద్దతిలో రోజూ తినాలి. అయితే అతడు రోజూ వరుసగా ఎన్నేసి చాక్లెట్లు తినాలో చెప్పగలరా?
జవాబు: 8+14+ 20+ 26 + 32


18 comments:

  1. నదికి ఒక వైపున మేక, పులి, గడ్డి మోపు మరియు రైతు ఉన్నాడు. నదిలో ఒక్కసారి రైతుతో పాటు ఒకదానికి మించి ప్రయాణం చేయకూడదు..రైతుతో పాటు మేక, పులి, గడ్డి మోపు నదికి రెండవ వైపుకు చేరుకోవాలి. ఎలా వెళ్ళాలో చెప్పండి ?

    ReplyDelete
  2. మొదట మేకను తనతో పాటు తీసుకొని వెళ్లి ఆవళి గట్టున వదిలేసి రావాలి. తరువాత గడ్డిని తెసుకొని వెళ్లి ఆవళి గట్టున పెట్టి మేకను తనతో పాటు తీసుకొని రావాలి. మేకను ఈవలి గట్టు న వదిలి పులిని తీసుకొని వెళ్లి ఆవళి గట్టున వదిలి రావాలి. తిరిగి వచ్చి మేకను తన కూడా తీసుకొని వెళ్ళాలి....

    ReplyDelete
  3. Mamagaru alludini intiki pilicharu.. alludu Jan 1 to 31 lo vastanu nenu a roju vastey antha bangaram pettali annadu. Mamagaru kamsali daggaraki velli bangaram 1gm nundi 31gms varaku billalu chesi ivvamantey kamsali 5 billalu chesi ichi veetitho mi alludu a roju vachina exact ga ivvaochu ani cheptha.. so aa billalu emiti?? Can any1 please send me the answer to 9502201101

    ReplyDelete
  4. Replies
    1. 1+2+4+8+16=31 if u do sum for that you will get all numbers upto 31 numbers

      Delete
  5. చెప్పుకోండి చూద్దాం :----

    ఐదక్షరాల ఊరి పేరు..ఒకటీ ఐదు కలిపితే కూర వండుకోవచ్చు , కూస్తుందికూడా, ఒకటీ మూడూకలిపితే స్పృహలోలేనట్లే, రెండూ మూడు లకు "లు" కలిపితే మొహం తుడుచుకోవచ్చు , మూడూ నాలుగు ఐదూ కలిపి పప్పు గాని పచ్చడి గాని చేసుకోవచ్చు...పండు కూడా తినొచ్చు,నాలుగు ఐదూ మళ్ళీ రిపీట్ చేస్తే ...ఈ జ్ఞానం అంటారు. ఒకటీ రెండూ కలిపి భగవంతుణ్ణి ఏదైనా వరం అడగొచ్చు ...ఆ ఊరి పేరేమిటి ?

    ReplyDelete
    Replies
    1. ఆ ఐదక్షరాల ఊరి పేరు :- కోరుమామిడి.

      Delete
  6. ఒక వర్తకుని 40 కేజీల గుండురాయి కింద పడి నాలుగు ముక్కలు అయ్యాయి.
    ఆ నాలుగు ముక్కల రాళ్ళు సమానంగా లేవు.
    ఆ నాలుగు ముక్కలతోనే
    తన వద్దకు వచ్చిన కొనుగోలుదారులకు 1 నుండి 40 కేజీల వరకు ఎవరికి ఎంత కావాలో అంత విక్రయిస్తున్నాడు.
    ఇంతకు ఆ నాలుగు ముక్కలలో ఒక్కొక్కటి
    తూకం ఎంత ఉంటుంది?
    జోస్యుల హరిప్రసాద్

    ReplyDelete
  7. ఇప్పుడు కష్టమైన లెక్క. లేకపోతే అందరూ నెట్ లో చూసేసి చెప్పేస్తారా 🤭 హమ్మా....*

    *🎯ఈ లెక్క చెయ్యండి చూద్దాం -*

    *🔹నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. దొంగ పిల్లలు కాని ఫర్వాలేదు మరీ దొంగలు కాదు. నలుగురూ కలిసి కొన్ని అరటి పండ్లు తెచ్చుకుంటారు తోటనుండి. తోట చాలా దూరం ఇంటికి. వచ్చేప్పటికి చీకటి పడిపోతుంది.*

    *🔹సరే, ఆ అరటిపళ్లని తర్వాత రోజు పంచుకుందామని పడుకుంటారు ఎవరి రూమ్ లో వాళ్ళు.*

    *🔹1. కాసేపటికి ఒకడు లేచి నేను ఇప్పుడే నా భాగం తీసుకుంటా అనుకుని, ఉన్న అరటి పండ్లను నాలుగు భాగాలు చేస్తాడు. ఒకటి మిగులుతుంది. దాన్ని బయట కోతి కోసం విసిరేసి, తన భాగాన్ని తను తీసుకుని వెళ్ళిపోతాడు.*

    *🔹2. రెండో వాడు లేచి అక్కడ ఉన్న వాటిని మళ్ళీ నాలుగు భాగాలు చేస్తే ఒకటి మిగులుతుంది. ఆ ఒకటిని కోతికి విసిరేసి తన భాగాన్ని తను తీసుకెళతాడు.*

    *🔹3. మూడో వాడు లేచి మిగిలి ఉన్న వాటిని మళ్ళీ నాలుగు భాగాలు చేస్తే మళ్ళీ ఒకటి మిగులుతుంది. దాన్ని కోతికి విసిరేసి తన భాగాన్ని తను తీసుకెళతాడు.*

    *🔹4. ఇక నాలుగో వాడు లేచి మిగిలి ఉన్న వాటిని మళ్ళీ నాలుగు భాగాలు చేస్తే మళ్ళీ ఒకటి మిగులుతుంది. దాన్ని కోతికి విసిరేసి తన భాగాన్ని తను తీసుకెళతాడు*.

    *🔹తెల్లవారుతుంది.*

    *🔹అందరూ వస్తారు. తాము చేసిన పని ఎవ్వరికీ ఎవ్వరూ చెప్పరు. సైలెంట్ గా ఉన్నవాటిని నాలుగు భాగాలు చేసి ఎవరి భాగం వాళ్ళు పట్టుకుపోతారు. ఈసారి కోతికి ఏమీ మిగలలేదు.*

    *🔹సో మొత్తం ఎన్ని అరటిపండ్లు తోటనించి తెచ్చారు??*

    *🔹చెప్పండి చూద్దాం??*

    ReplyDelete
  8. పిపీలకం. Telugu meaning చెప్పండి

    ReplyDelete

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు