Pages

Showing posts with label Bhaskara Shataka Padyalu. Show all posts
Showing posts with label Bhaskara Shataka Padyalu. Show all posts

Bhaskara Shataka Padyalu - Okkade Chaalu

భాస్కర శతక పద్యాలు -  ఒక్కడె చాలు  
ఒక్కడె చాలు నిశ్చలబలోన్నతుఁ డెంతటి కార్యమైనఁదాఁ
జక్క నొనర్పఁ గౌరపు లసంఖ్యులు పట్టిన థేనుకోటులం
జిక్కఁగ నీక తత్ప్రబలసేన ననేక శిలీముఖంబులన్
మొక్కవడంగఁ జేసి తుద ముట్టఁడె యొక్క కిరీటి  భాస్కరా!

తాత్పర్యము:  ఉక్కుగల వాడొక్కడైనను ఎంత ఘనకార్యమైన సాధింపగలడు. మహాబలశాలి యగు నర్జునుడు తా నొక్కఁడైనను పెక్కురు కౌరవవీరుల గెలిచి యావులను మరలింపలేదా?

Bhaskara Shataka Padyalu - Ela Samasta Vidyalu

భాస్కర శతక పద్యాలు - ఏల సమస్తవిద్యలు 
ఏల సమస్తవిద్యలు నొకించుక భాగ్యము గల్గియుండినన్ 
జాలు ననేకమార్గముల సన్నుతి కెక్కన దెట్లోకో యన్ 
రాలకు నేడ విద్యలు తిరంబుగ దేవరరూపు చేసినన్ 
వ్రాలి నమస్కరించి స్రవంబులు వెట్టరె మీఁద భాస్కరా!

తాత్పర్యము:  రాళ్లు విద్యలు నేర్వకున్నను, వానిని దేవతా విగ్రహముగా చేసినచో వాని పాదముల మీద పడి, పూవులతో వానిని మానవులు పూజింతురు. అటులనే కొంచెము భాగ్యమైనను గల మానవుడు అనేక రీతులుగ పొగడబడుచుండును కాని, విద్యలు నేర్చినందున కాదు. 
 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు